Ad Code

LiL E ఎలక్ట్రిక్ సైకిల్‌ !


ఎవరైనా వెహికిల్ కొనాలనుకుంటే ఎలక్ట్రిక్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అందుకే సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ రూపంలోకి మారిపోతున్నాయి. ఈ క్రమంలో EMotorad కంపెనీ.. LiL E ఎలక్ట్రిక్ సైకిల్‌ని తెచ్చింది. ఇది 10 అంగుళాల సింగిల్ స్పీడ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ సైకిల్. దీన్ని కిక్ అవసరం లేని స్కూటర్‌గా కంపెనీ చెబుతోంది. ఈ సైకిల్‌ని మీరు కంపెనీ వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో కొనవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.29,999గా ఉంది. దీని అసలు ధర రూ.33,000గా చెబుతున్నారు. ఈ సైకిల్ రెండు కలర్స్‌లో లభిస్తుంది. దీనికి 1 సంవత్సరం వారంటీ ఉంది. ఈ సైకిల్ బ్యాటరీ బ్యాటరీ 36 V వోల్టేజ్ కలిగివుంది. 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. ఇది 20 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ సైకిల్‌కి 3 స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. దీని అత్యధిక వేగం గంటకు 25 కిలోమీటర్లు. దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. దీనికి ముందు వైపు వైర్ బ్రేక్ ఉండగా.. వెనక వైపు డిస్క్ బ్రేక్ ఉంది. అందువల్ల సడెన్ బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది అంటున్నారు. ఈ సైకిల్‌కి LED హెడ్‌లైట్ డిస్‌ప్లే ఉంది. అందువల్ల చీకట్లో కూడా కాంతి బాగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ సైకిల్‌ని మూడున్నర అడుగుల నుంచి ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే వారు వాడుకోవచ్చు. 250W మోటర్ ఉండటం వల్ల.. రెగ్యులర్ కిక్ స్కూటర్ల కంటే బాగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త డిజైన్, యూనిక్ సైకిల్ కావాలి అనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది అని కంపెనీ తెలిపింది. ఈ సైకిల్‌ని మడతపెట్టే వీలు ఉంది. తద్వారా దీన్ని కారులో ఇతర వాహనాల్లో ఈజీగా తీసుకెళ్లవచ్చు. మడతపెట్టేటప్పుడు లాక్ వేసుకునే వీలు ఉంది. దీని బరువు 13 కేజీలు. రోజు వారీ అవసరాలకూ, 20 కిలోమీటర్ల లోపు జర్నీ చేయాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu