Ad Code

10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ ?


ఇన్ఫినిక్స్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, అద్భుతమైన డిజైన్లతో ఫోన్లను తయారు చేస్తుంది. ఇటీవలే ఈ సంస్థ 260W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ఇంత ఫాస్ట్ ఛార్జింగ్‌ సిస్టమ్‌ను రిలీజ్ చేయలేదు. దాంతో ఇన్ఫినిక్స్‌ తీసుకురానున్న 260W ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్ కానుంది. కాగా ఈ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అప్‌కమింగ్ GT 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తాజా రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఇన్ఫినిక్స్‌ గతంలో 180W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఫోన్‌ను విడుదల చేసింది. త్వరలో కొత్త 260W ఛార్జింగ్ కెపాసిటీని అందించేందుకు సిద్ధమైంది. ఇన్ఫినిక్స్‌ 110W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా చూపించింది. ఈ కొత్త 110W వైర్‌లెస్‌ ఛార్జర్లు 16 నిమిషాల్లో ఫోన్‌ను 0 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తాయి. దీనిని GT 10 Proలో అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. GT 10 ప్రోలో Infinix 5000mAh బ్యాటరీని అందిస్తుందని ఒక రిపోర్టు వెల్లడించింది. కంపెనీ కొద్ది రోజుల క్రితం 260W ఛార్జింగ్ అడాప్టర్‌తో 4400mAh బ్యాటరీని ఉపయోగించి తన ఛార్జింగ్ టెక్‌ని ప్రదర్శించింది. ఆ ఛార్జింగ్ టెక్‌తో 4400mAh బ్యాటరీ 8 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అయ్యింది. అంటే అప్‌కమింగ్ GT 10 ప్రో మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం పది నిమిషాల సమయం పడుతుందని చెప్పవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu