Ad Code

15 న విడుదల కానున్న గెలాక్సీ A34 5G, గెలాక్సీ A54 5G

గెలాక్సీ A34 5G మరియు గెలాక్సీ A54 5G మార్చి 15న లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్‌లు ఇతర వివరాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నారు, ఒక టిప్‌స్టర్ ఈ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అంచనా ధరను కూడా లీక్ చేశారు. లీక్ అయిన ధరల వివరాల ప్రకారం శాంసంగ్ యొక్క రాబోయే రెండు హ్యాండ్‌సెట్‌ లు 128GB స్టోరేజ్ మోడల్‌కు సంబంధించినవి. టిప్‌స్టర్ స్నూపీ టెక్ శాంసంగ్ గెలాక్సీ A34 5G మరియు A54 5G 128GB వేరియంట్‌ల ధరను లీక్ చేసింది. ఈ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం, గెలాక్సీ A34 5G ధర 128GB వేరియంట్ కోసం EUR 419 (దాదాపు రూ. 36,600) అయితే గెలాక్సీ A54 5G ధర EUR 519 (దాదాపు రూ. 45,400). ఈ లీకైన ధరలు యూరప్‌లోని వినియోగదారులకు వర్తిస్తాయని అంచనా వేయబడింది. ఇంకా,ఈ ఫోన్లు తక్కువ ధరకు భారతీయ మార్కెట్లోకి లాంచ్ కావొచ్చని తెలుస్తోంది. గెలాక్సీ A54 5G పూర్తి HD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో శాంసంగ్ యొక్క ఎక్సీనోస్ 1380 ఆక్టా కోర్ SoCని అమర్చవచ్చు. ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ తృతీయ సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ను తీసుకువస్తుందని అంచనా వేయబడింది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు IP67 రేటింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. గెలాక్సీ A34 5G ఫోన్ 6.6-అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుందని మరియు మీడియా టెక్ MT6877V ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్ తో పనిచేస్తుందని నివేదికలు తెలియచేస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu