Ad Code

మార్చి 31లోపు ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం తప్పనిసరి !


మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి, లేదంటే పాన్ కార్డును కేవైసీగా వివిధ ఆర్థిక లావాదేవీలకు అనుమతించబోమని ఆదాయం పన్ను విభాగం తేల్చి చెప్పింది. వేతన జీవులు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఐటీ రిటర్న్స్‌లో పన్ను రాయితీలు క్లయిమ్ చేయాలంటే ఈ నెలాఖరులోగా వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే పెనాల్టీ చెల్లించడంతోపాటు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నెలాఖరులోగా పలు ముఖ్యమైన ద్రవ్య సంబంధమైన లావాదేవీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రతి వేతన జీవి ఈ నెలాఖరులోగా తన పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. అలా చేయకపోతే సంబంధిత పాన్ కార్డు పనికి రాకుండా పోతుంది. ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా పాన్‌-ఆధార్ కార్డులను అనుసంధానించాల్సిందేనని ఆదాయం పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2017 జూలై ఒకటో తేదీకి ముందు పాన్‌కార్డు తీసుకున్న వారు ఆధార్ కార్డు పొందేందుకు అర్హులు. తమ ఆధార్ కార్డు వివరాలను ఆదాయం పన్నుశాఖకు గడువులోపు తెలియజేయాలి. గడువులోపు పాన్‌-ఆధార్ కార్డులను అనుసంధానించకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాన్ కార్డు పనికిరాకుండా పోతుంది. `ఆధార్ కార్డు వివరాలు తెలియజేయకుంటే ఈ నెల 31 తర్వాత సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్ కార్డు పనికి రాదు. చట్ట ప్రకారం పాన్ కార్డు పనికి రాకపోగా ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది` అని గతేడాది మార్చి 30న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. పాన్ కార్డు పనికిరాకుండా పోతే అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులతోపాటు ఇతర ఆర్థిక లావాదేవీల్లో దాన్ని సంబంధిత వ్యక్తి కేవైసీగా ఉపయోగించుకోలేరు. పాన్‌-ఆధార్ కార్డుల అనుసంధానానికి రూ.1000 ఆలస్య ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu