Ad Code

చాట్‌జీపీటీ-4 వెర్షన్‌తో ఉద్యోగాలకు ముప్పు ?


ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడం నుంచి కవరింగ్ లెటర్లు రాయడం, కోడింగ్ సహా ఏ ప్రాబ్లమ్‌కైనా చిటికెలో సొల్యూషన్ సూచిస్తోన్న చాట్‌జీపీటీ వేగంగా యూజర్ల ఆదరణ పొందుతోంది. మనుషులకు సాయం చేసేందుకు ఏఐ తోడ్పడేలా చాట్‌జీపీటీని ఆవిష్కరించామని ఓపెన్ ఏఐ చెబుతుండగా ఇప్పుడు ఈ ఏఐ టూల్ ఏకంగా పలు ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా ఉంది. రెజ్యూమ్‌బిల్డర్‌.కాం ఇటీవల 1000 మంది బిజినెస్ లీడర్లతో మాట్లాడగా ఏఐ టూల్‌తో కొలువుల కోత తప్పదనే సంకేతాలు వెల్లడయ్యాయి. పలు కంపెనీలు ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టి పెద్దసంఖ్యలో వర్కర్లను తొలగిస్తున్నాయి. ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళన నడుమ స్వయంగా చాట్‌జీపీటీ ప్రమోటర్లు మరింత మెరుగైన న్యూ అడ్వాన్స్‌డ్ చాట్‌జీపీటీ-4ను ముందుకు తీసుకువచ్చింది. న్యూ అడ్వాన్స్‌డ్ జీపీటీ-4 వెర్షన్ సామర్ధ్యాలపై టెస్టింగ్ జరుగుతుండగానే షాకింగ్ ఫలితాలు వచ్చాయి. జీపీటీ-4 ఏయే ఉద్యోగాలను రీప్లేస్ చేయగలదని ట్విట్టర్ యూజర్ ప్రశాంత్ రంగస్వామి ప్రశ్నించగా చాట్‌బాట్ నివ్వెరపోయే సమాధానం ఇచ్చింది. జీపీటీ-4 తాను 20 ఉద్యోగాలను రీప్లేస్ చేయగలనని బదులిచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu