Ad Code

జిపిటి-4లో దృష్టి లోపం ఉన్నవారికి సరికొత్త ఫీచర్‌ !


జిపిటి-4 లేటెస్ట్ వెర్షన్‌ సామర్థ్యాలు కొన్ని రకాల అప్లికేషన్‌ల సేవలను సమూలంగా మార్చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ తరహాలో చాలా కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీని తమ ప్రొడక్టులకు యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. కొత్త GPT-4 ఇమేజ్ ప్రాంప్ట్‌లను తీసుకుని AI-పవర్డ్‌ విజువల్స్‌ను రూపొందించగలదు. ఈ కొత్త సామర్థ్యాన్ని దృష్టి లోపం ఉన్నవారికి సేవలు అందిస్తున్న 'బీ మై ఐస్ యాప్‌ వినియోగించుకోనుంది. అంధులకు మెరుగైన సేవలు అందించేలా అప్‌గ్రేడ్‌ అవుతోంది. GPT-4 డైనమిక్ ఇమేజ్-టు-టెక్స్ట్ జనరేటర్‌ను ఉపయోగించుకుని 'వర్చువల్ వాలంటీర్' అనే AI ఫీచర్‌ను బీ మై ఐస్ యాప్‌ తీసుకురానుంది. ప్రస్తుతం వర్చువల్ వాలంటీర్ టూల్ బీటా టెస్టింగ్‌లో ఉందని కంపెనీ పేర్కొంది. బీ మై ఐస్ అనేది వీడియో కాల్ ద్వారా వాలంటీర్లు, కంపెనీ ప్రతినిధుల సంఘంతో దృష్టిలోపం ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారం ద్వారా చూపులేని వారు వివిధ రోజువారీ అవసరాలకు వాలంటీర్ల సహాయం పొందవచ్చు. చిన్న టెక్ట్స్‌ని చదవడం, రంగులను గుర్తించడం వంటి పనులు ఉంటాయి. అయితే యాప్ అంతర్లీనంగా కమ్యూనిటీ-ఆధారితమైనది, దాని వినియోగదారులు ఇతరులపై ఆధారపడి ఉంటారు. ఇతరుల అవసరం ఉండదు!GPT-4 టెక్నాలజీని చేర్చడం ద్వారా, యాప్‌ వినియోగదారులు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. GPT-4లోని ఇమేజ్‌లను అనలైజ్‌ చేసే సామర్థ్యం, బీ మై ఐస్ యాప్‌లో కీలకంగా మారనుంది. ఈ ఫీచర్ ద్వారా దృష్టిలోపం ఉన్న వినియోగదారులు AIతో ఇమేజ్‌లను షేర్‌ చేసుకోవచ్చు, వాటి గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు దృష్టిలోపం ఉన్నవారు వ్యాయామం చేయడానికి జిమ్‌కి వెళ్లినప్పుడు ఇన్‌స్ట్రుమెంట్‌లను ఈ ఫీచర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడున్న ఇన్‌స్ట్రుమెంట్‌ల ఫొటోలను ఏఐకి షేర్‌ చేస్తే, అది ఆబ్జెక్ట్‌ను అనలైజ్‌ చేసి వివరాలను అందిస్తుంది. ఇలా ఇతరుల సాయం లేకుండా అంధులు వస్తువులను గుర్తించవచ్చు. త్వరలో అందరికీ అందుబాటులోకి వర్చువల్ వాలంటీర్ ఫీచర్ ప్రస్తుతం నిర్దిష్ట టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. 'బి మై ఐస్' వినియోగదారులు AI ఫీచర్ కోసం వెయిట్‌లిస్ట్‌లో ఉండటానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది రాబోయే వారాల్లో మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ చర్యలు తీసుకుంటోంది. యాప్‌ వినియోగదారులు అందరికీ వర్చువల్ వాలంటీర్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది కంపెనీ ధృవీకరించింది.

Post a Comment

0 Comments

Close Menu