Ad Code

భూమికి 60 వేల కి.మీ దూరం జరిగిన చంద్రుడు !


చంద్రుడు క్రమ క్రమంగా భూమికి దూరమవుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.భూమి నుంచి చంద్రుడు ప్రతి సంవత్సరం 3.8 సెంటి మీటర్ల దూరం జరుగుతున్నట్లు యూఎస్ లోని నేషనల్ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్ పరిశోధకులు గుర్తించారు. 1969లో అపోలో మిషన్ ద్వారా చంద్రునిపై ఏర్పాట్లు చేసిన ప్యానెళ్ల ఆధారంగా ఈ దృగ్విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనికి కారణం మిలంకోవిచ్ సైకిల్ అని పరిశోధకులు వెల్లడించారు. చంద్రుడు భూమికి దూరంగా జరగడం ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతోందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం.. చంద్రుడు 2.46 బిలియన్ సంవత్సరాల్లో భూమి నుంచి 60 వేల కిలో మీటర్ల దూరం జరిగినట్లు పేర్కొన్నారు. చంద్రుడు సంవత్సరానికి 3.8 కిలో మీటర్ల చొప్పున భూమికి దూరమవుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సౌర వ్యవస్థలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే, చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి లాగే బృహస్పతి, శని వంటి గ్రహాలు కూడా చాలా చంద్రుళ్లను కలిగి ఉంటాయి. ఇవి ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతాయి. భూమికి సంబంధించినంత వరకు భూమి ఉష్ణోగ్రత, వాతావరణానికి చంద్రునికి ముఖ్యమైన సహకారం ఉంది. కేంద్రం నుంచి కొంత దూరం భూమి చుట్టూ చంద్రుడి భ్రమణాన్ని మిలంకోవిచ్ భ్రమణం అని పిలుస్తారు. అయితే ఈ మిలాన్ కోవిచ్ సైకిల్ మార్గం రోజు రోజుకూ దూరమువుతున్నట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలోనే చంద్రుడు రోజు రోజుకూ భూమికి దూరమవుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. చంద్రుడు క్రమంగా భూమికి దూరమవుతున్నాడన్న వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu