Ad Code

స్పామ్‌ మెసేజ్‌లకు విరుగుడు వైజ్‌లీ ఏటీపీ !


స్పామ్‌ మెసేజ్‌ల త్వరలో  పీడ విరగడకానున్నది. ఏది స్కామ్‌, ఏది స్పామ్‌ కాదో ? దేన్ని నమ్మాలో తెలియక మోసపోతున్న సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఊరట కలిగించే  కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. సోమవారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచస్థాయి సదస్సులో హైదరాబాద్‌కు చెందిన తాన్ల అనే ఐటీ కంపెనీ వైజ్‌లీ ఏటీపీ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ పని తీరును ప్రదర్శించింది. దీనిద్వారా 99 శాతం స్పామ్‌, ఫిషింగ్‌ మెసేజ్‌లను కట్టడి చేయవచ్చని నిరూపితమైంది. త్వరలో ఇది అందుబాటులోకి రానున్నది. నిత్యం వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తూ ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు దోచేస్తున్నారు. వైజ్‌లీ ఏటీపీతో ఇలాంటి మోసాలకు చెక్‌పెట్టొచ్చని తాన్ల కంపెనీ భరోసానిస్తున్నది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న 'తాన్లా' క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను జోడించి యూజర్‌ ఎండ్‌ టు ఎండ్‌ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. సెల్‌ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్‌లను గుర్తించే వైజ్‌లీ ఏటీపీ ఎండ్‌ టు ఎండ్‌ ఫిషింగ్‌ ప్రొటెక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫోన్లకు వచ్చే స్పామ్‌ మెసేజ్‌లను నిరోధిస్తుంది. విశ్వసనీయ బ్రాండ్‌లు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు గ్లోబల్‌ యాంటి ఫిషింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌గా ఏటీపీని ఉపయోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ మోసాల వల్ల 55 బి లియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని గ్లోబ ల్‌ యాంటీ స్కామ్‌ అలయెన్సెస్‌ వెల్లడించిం ది. తాన్లా అందుబాటులోకి తెచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌ సెల్‌ఫోన్లకు వచ్చే అనుమానిత మెసేజ్‌ల సమాచారాన్ని ఆయా ఫోన్ల నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు, గూగుల్‌, వాట్సాప్‌, దర్యాప్తు ఏజెన్సీల దృష్టికి తీసుకొస్తుంది. దీంతో పాటు వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu