Ad Code

గూగుల్ మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్‌ !


గూగుల్ యూజర్ల కోసం 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్ తీసుకొచ్చింది. ఒకప్పుడు ఈ ఫీచర్ కేవలం పిక్సెల్ ఫోన్లలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్‌ను 2021లో ప్రారంభించింది. ఈ ఫీచర్ మొబైల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ప్రముఖ ఫీచర్‌లలో ఒకటి. ఈ ఫీచర్ సహాయంతో, చిత్రంలో ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. కావాలనుకుంటే వాటిని తీసివేయవచ్చు. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేయాలి. దీని తర్వాత, మీరు ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటున్న చిత్రాన్ని ఎంచుకోవాలి. స్క్రీన్ దిగువన ఉన్న "Edit"ని నొక్కిన తర్వాత, "Magic Eraser"ని ఎంచుకోండి. ఆ తర్వాత ఫొటోను స్కాన్ చేసి, తీసివేయాల్సిన అంశాన్ని యాప్ హైలైట్ చేస్తుంది. మాన్యువల్‌గా ఎంచుకోవడం ద్వారా అన్నింటినీ తొలగించవచ్చు. చుట్టుపక్కల ఉన్న వస్తువులు లేదా మనుషులను తొలగించుకోవచ్చు. మీ ఫొటోలలో మీరు లేదా కావాల్సిన వ్యక్తులను మాత్రమే ఉంచొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu