Ad Code

కంటి వ్యాధులను పసిగట్టే యాప్ !


దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్  వైరలవుతోంది. 9 ఏండ్ల వయసులోనే యాప్‌ను క్రియేట్ చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసలు పొందిన హనా రఫీక్ సోదరే లీనా రఫీక్‌. 11 ఏండ్లకే దుబాయ్‌కు చెందిన భారతీయ బాలిక లీనా కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సొంతంగా కోడింగ్ నేర్చుకున్న లీనా ఆగ్లర్ ఐస్కాన్ పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ యాప్ వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు, కంటి పరిస్ధితిని ఇట్టే పసిగట్టేస్తుంది. ఆర్కస్‌, మెలనొమా, శుక్లాలు వంటి వ్యాధులు, పరిస్ధితులను గుర్తించేందుకు ఆగ్లర్ ట్రైన్‌డ్ మోడల్స్‌ను వినియోగిస్తుంది. ఏఐ మొబైల్ యాప్ ఆగ్లర్ ఐస్కాన్‌ను సబ్‌మిట్ చేస్తున్నందుకు ఉద్వేగంగా ఉంది. నేను పదేండ్ల వయసులో ఈ యాప్‌ను క్రియేట్ చేశా..మీ ఐఫోన్‌తో వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా ఆగ్లర్ పలు కంటి వ్యాధులు, పరిస్ధితులను పసిగడుతుందని లింక్డిన్ పోస్ట్‌లో లీనా రాసుకొచ్చింది. అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ విజన్‌, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఆల్గర్ యాప్ పనిచేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu