Ad Code

శాంసంగ్‌ ఫేక్ మూన్ షాట్స్ ?


శాంసంగ్‌ అల్ట్రా సిరీస్ స్మార్ట్‌ ఫోన్లలోని కెమెరా జూమింగ్‌ సామర్థ్యం ఫీచర్ పై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా సిరీస్ ఫోన్‌ లోని స్పేస్ జూమ్ ఫీచర్‌ పై డిస్కషన్ జరుగుతోంది. అయితే గెలాక్సీ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు, మూన్ షాట్‌ లు నకిలీవని తాను గుర్తించానంటూ ఓ రెడిట్ యూజర్ ఇటీవల ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈనేపథ్యంలో తాజాగా శాంసంగ్‌ స్పందించింది. నకిలీ మూన్ షాట్‌ ఆరోపణలను ఖండించింది. అది ‘నకిలీ’ వివరణాత్మక మూన్ షాట్‌ కాదని, కెమెరా యాప్ లోని “సీన్ ఆప్టిమైజర్” ఫీచర్ వల్ల ఆ ఎఫెక్ట్ వస్తుందని చెప్పింది. సీన్ ఆప్టిమైజర్ వల్లే చంద్రుని  ఫోటోలు క్లియర్ గా వస్తాయని శాంసంగ్‌ వెల్లడించింది. కెమెరాను 25x లేదా అంతకంటే ఎక్కువ జూమ్ చేసినప్పుడు, “సూపర్ రిజల్యూషన్” ద్వారా 10కి పైగా చిత్రాలను మిళితం చేసి ఫోటోను స్పష్టంగా మార్చేందుకు “సీన్ ఆప్టిమైజర్” ఉపయోగ పడుతుందని పేర్కొంది. ఈ క్రమంలో సౌండ్ ఎక్స్‌పోజర్‌ను కూడా తగ్గిస్తుందని తెలిపింది. ఆప్టికల్, డిజిటల్ స్టెబిలైజేషన్‌ని కలపడం ద్వారా చంద్రుడి ఫోటోలో అస్పష్టతను తొలగిస్తుందని వివరించింది. “జూమ్ లాక్” ఫీచర్‌ ద్వారా చంద్రుడి ఇమేజ్ బ్లర్ కాకుండా యూజర్ కు కనిపిస్తుందని పేర్కొంది. చంద్రుడి ఫోటోలను క్లియర్ గా తీసేందుకు మాత్రమే శాంసంగ్‌ అల్ట్రా సిరీస్ స్మార్ట్‌ఫోన్లలోని కెమెరా యాప్ ఏఐ డీప్ లెర్నింగ్ మోడల్ ను వినియోగిస్తుందని శాంసంగ్‌ స్పష్టం చేసింది. అయితే “సీన్ ఆప్టిమైజర్” ఫీచర్ ని ఆఫ్ చేసి కూడా ఫోటోలు తీయొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu