Ad Code

బోనస్ చెల్లింపుల్లో కోత !


రెండో దశ మాస్ లేఆఫ్స్‌లో భాగంగా మెటా ఇటీవల 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయగా తాజాగా పలువురు ఉద్యోగుల బోనస్ చెల్లింపుల్లో కోత విధించేందుకు కంపెనీ సన్నహాలు చేపట్టింది. 2022 నవంబర్‌లో ఫేస్‌బుక్ మాతృ సంస్ధ మెటా ఏకంగా 11,000 మందిని తొలగించింది. ఆర్ధిక మందగమనం, మాంద్య భయాలతో ఈ ఏడాది పలువురు ఉద్యోగులకు తక్కువగా బోనస్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. రెండేండ్లకు ఒకసారి ఉద్యోగుల సామర్ధ్యాన్ని సమీక్షించేందుకు సన్నద్ధమవుతోంది. గత ఏడాది ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా తమ సామర్ధ్య సమీక్ష ప్రక్రియలో మార్పులు చేపట్టామని, ఈ మార్పులకు ఉద్యోగుల పునర్వ్యవస్ధీకరణతో సంబంధం లేదని మెటా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో మెటా ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, కంపెనీలో నియామకాలు,అంతర్గత బదిలీలు తిరిగి ప్రారంభమవుతాయని లేఆఫ్స్ సమయంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇక మెటాతో పాటు అమెజాన్, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మారిన స్ధూల ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో లేఆఫ్స్‌కు తెగబడ్డాయి.

Post a Comment

0 Comments

Close Menu