Ad Code

డక్‌డక్‌గో నుంచి డక్‌అసిస్ట్‌ లాంచ్ !


చాట్‌జీపీటీ లాంచ్ మైక్రోసాఫ్ట్, గూగుల్  వంటి టెక్ దిగ్గజాల్లో గుబులు రేపింది. అందుకే వెంటనే ఈ సంస్థలు తమ యూజర్ బేస్ కోల్పోకుండా చాట్‌జీపీటీ లాంటి సెర్చ్ రిజల్ట్స్ అందించే చాట్‌బాట్‌లను తీసుకొచ్చాయి.  ప్రైవసీ-ఫోకస్డ్ సెర్చ్ ఇంజన్ డక్‌డక్‌గో కూడా ఈ కంపెనీల బాటే పట్టింది. ఈ సెర్చ్ ఇంజన్ ChatGPT-లాంటి సెర్చ్ రిజల్ట్స్ అందించడానికి దాని సొంత AI-బేస్డ్ చాట్‌బాట్ లాంచ్ చేసింది. డక్‌అసిస్ట్‌ అని పిలిచే ఈ చాట్‌బాట్ OpenAI నుంచి AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ChatGPT తయారీదారులు, AI స్టార్టప్ ఆంత్రోపిక్ మాజీ-OpenAI ఉద్యోగులు డక్‌అసిస్ట్‌ని తయారు చేసి ఇచ్చారు. వీరు డక్‌డక్‌గో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కు శక్తినిచ్చే చాట్‌బాట్‌లను అందించారు. రిజల్ట్స్ వికీపీడియా ద్వారా కూడా డెలివర్ అవుతాయి. ఈ రిజల్ట్స్ క్రిస్పీగా ఉంటాయి. కాగా రిజల్ట్స్‌ను మార్చకుండా డేటాను స్వయంగా ఎడిటింగ్ చేసే ఫీచర్ కారణంగా కొంతమంది యూజర్లు వికీపీడియాను ఇష్టపడుతుంటారు. DuckAssist అనేది చాట్‌జీపీటీ, Bing చాట్‌లా కాకుండా సెర్చింగ్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా పని చేస్తుంది. మీ ప్రశ్నకు కొటేషన్లుతో క్విక్ ఇన్ఫో అందించడానికి ఇది ఆన్‌లైన్ సోర్సస్ ఉపయోగిస్తుంది. ఫలితంగా మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లి చాలా సమయం పాటు వెతకాల్సిన అవసరం ఉండదు. అడిగిన ప్రశ్నకు కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వడమే తమ ఏఐ అసిస్ట్ స్పెషాలిటీ అని కంపెనీ చెబుతోంది. DuckDuckGo యూజర్లు యాప్, బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌ ద్వారా కొత్త AI అసిస్టెంట్‌ని యాక్సెస్ చేయవచ్చు. DuckDuckGo అందుబాటులో ఉన్న అన్ని డివైజ్‌లకు డక్‌అసిస్ట్‌ని ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డక్‌అసిస్ట్‌ బీటా వెర్షన్ అందరికీ ఉచితం, అలానే దీనిని వాడేందుకు లాగిన్ కావాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు AI అసిస్టెంట్ ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మరికొద్ది వారాల్లో సెర్చ్ యూజర్లందరూ దీనిని ట్రై చేయవచ్చు. డక్‌అసిస్ట్‌ రెస్పాన్స్ టైమ్, రిజల్ట్స్ యాక్యురసీ మెరుగుపరచడానికి డక్‌డక్‌గో మరిన్ని సోర్సెస్ ఉపయోగించాలని ప్లాన్ చేస్తోంది. అది అందించిన కంటెంట్ రిలవెన్స్‌పై దృష్టి సారించడం, ఫేక్ ఇన్ఫో ఇవ్వకుండా చూసుకోవడం కూడా కంపెనీకి చాలా కీలకం. ఇక AI చాట్‌బాట్‌లు ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్ ChatGPT కోసం ఓపెన్ AIలో 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలానే Bing సెర్చ్, ఎడ్జ్ బ్రౌజర్ చాట్‌బాట్‌ను పొందిన Microsoft తొలి ప్రొడక్ట్స్ గా అవతరించాయి. ఇది Bingకి దాని స్పేస్‌లో బలమైన పోటీదారుగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ AI-based Bing సెర్చ్ ఇంజన్ డైలీ 100 మిలియన్ల యాక్టివ్ యూజర్లను అధిగమించింది. Bingలో ChatGPT ఇంటిగ్రేషన్ అనేది మునుపెన్నడూ లేని విధంగా దాని వినియోగాన్ని పెంచడంలో చాలా సహాయపడింది. ఇక దాని పోటీదారు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో డైలీ ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. సెర్చ్ రిజల్ట్స్ కోసం డక్‌డక్‌గో పరిచయం చేసిన కొత్త AI అసిస్టెంట్ డక్‌అసిస్ట్‌ అనేది దానిని పోటీ రేస్‌లో ఉంచుతుంది.

Post a Comment

0 Comments

Close Menu