Ad Code

ఎలక్ట్రిక్ బైక్ ఏరా !


మాటర్ ఎనర్జీ ఆటోమొబైల్ కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఏరా ను లాంచ్ చేసింది. 4 వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం రెండు వేరియంట్లను సేల్స్‌కి అందుబాటులో ఉంచింది. అవి ఏరా 5000, ఏరా 5000+. ప్రస్తుతం రెండు వేరియంట్లను సేల్స్‌కి అందుబాటులో ఉంచింది. ఈ రెండు వేరియంట్లకీ 5kWh బ్యాటరీ ఉంది. దీన్ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 125 కిలోమీటర్లు వెళ్తాయని కంపెనీ తెలిపింది. బ్యాటరీ, వెహికిల్‌కి 3 ఏళ్ల వారంటీ ఉంది. 4 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి. ఈ బైక్స్‌కి లిక్విడ్-కూల్డ్ మోటర్ ఉంది. దీని పీక్ పవర్ ఔట్‌పుట్ 10.5kWగా ఉంది. బ్యాటరీ బరువు 40 కేజీలు ఉంటుంది. బైక్ బరువు 180 కేజీలు ఉంది. ఏరా 5000 వేరియంట్‌కి 7 అంగుళాల టచ్ డిస్‌ప్లై ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీ-లెస్ ఆపరేషన్, OTA అప్‌డేట్స్, ప్రోగ్రెస్సివ్ బ్లింకర్స్, వెల్‌కం లైట్స్ ఉన్నాయి. ఏరా 5000+ వేరియంట్‌కి బ్లూటూత్ కనెక్టివిటీ, మిగతా ఫీచర్లతోపాటూ.. అదనంగా లైఫ్‌స్టైల్ అండ్ కేర్ ప్యాకేజీ కూడా ఉంది. LED హెడ్ ల్యాంప్‌తోపాటూ.. టైల్ ల్యాంప్స్, రియర్, ఫ్రంట్ ఇండికేటర్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. అలాగే ఈ బైక్‌కి చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. మూడు రైడ్ మోడ్స్ ఉన్నాయి. అవి ఎకో (గంటకు 30కి.మీ), సిటీ (గంటకు 70కి.మీ), స్పోర్ట్ (గంటకు 95కి.మీ) ఫ్రంట్, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అవి ABS సపోర్టుతో ఉన్నాయి. ఏరా 5000 బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.44 లక్షలు. అలాగే.. ఏరా 5000+ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.54 లక్షలుగా ఉంది. మాటెర్ ఎనర్జీ కంపెనీ.. తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని.. వచ్చే 45 రోజుల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించనుంది. ఆ తర్వాత వచ్చే 3 నెలల్లో దేశవ్యాప్తంగా 20 డీలర్‌షిప్స్ ఓపెన్ చేయనుంది. అలాగే ఈ ఏడాది చివరికి ఈ సంఖ్యను 100కి పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ , హైదరాబాద్ , అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె, చెన్నైలో ఆర్డర్స్ తీసుకుంటున్నారు. వచ్చే 30 రోజుల వరకూ బుకింగ్స్ ఓపెన్‌గా ఉంటాయని మాటర్ ఎనర్జీ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్స్ ఓపెన్ అయ్యాయి. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె, చెన్నైలో ఆర్డర్స్ తీసుకుంటున్నారు. వచ్చే 30 రోజుల వరకూ బుకింగ్స్ ఓపెన్‌గా ఉంటాయని మాటర్ ఎనర్జీ కంపెనీ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu