Ad Code

రాత్రిపూట మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా ?


చాలా మందికి రాత్రిపూట మొబైల్‌ను ఛార్జ్‌లో ఉంచడం అలవాటు. అలా చేయడం ద్వారా మరుసటి రోజు మొత్తం ఆ ఛార్జింగ్ ఉపయోగపడుతుందని భావిస్తారు. అసలు మొబైల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 6 నుండి 8 గంటల సమయం అవసరం లేదు. మీ మొబైల్ కూడా స్మార్ట్‌ అని మీరు అర్ధం చేసుకోవాలి. ఫుల్‌గా 100% ఛార్జ్ అయిన తర్వాత మీ మొబైల్ ఛార్జింగ్ ఆగిపోతుంది. మునపటి మొబైల్ ఫోన్‌లతో అయితే ఛార్జింగ్ విషయంలో పలు సమస్యలు తలెత్తేవి. కాని ఇప్పుడు మొబైల్స్‌ అందుకు కొంచెం భిన్నంగా వర్క్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ఛార్జింగ్ సర్క్యూట్ ఉంది. ఇది బ్యాటరీ 100% ఛార్జ్ అయిన తర్వాత సరఫరాను నిలిపివేస్తుంది. చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పుడు స్నాప్‌ డ్రాగన్ ప్రాసెసర్ ఉంది. అది బ్యాటరీ ఫుల్‌గా ఛార్జ్ అయిన వెంటనే.. మొబైల్ ఛార్జింగ్ ఆపేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఆ ప్రాసెసర్ బ్యాటరీ 90 శాతం వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జ్ చేయడం ప్రారంభించేంత స్మార్ట్‌గా ఉంటుంది. ఛార్జింగ్ సమయంలో మొబైల్ వేడిగా ఉన్నప్పుడు చాలామంది భయపడతారు. అలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ సమయంలో లిథియం అయాన్ బ్యాటరీ రసాయన ప్రతిచర్యకు గురవుతుంది. బ్యాటరీ పాజిటివ్ (+) ఛాంబర్‌లో ఉన్న అయాన్లు నెగటివ్ (-) ఛాంబర్ వైపు ప్రవహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో బ్యాటరీ అప్పుడప్పుడూ వేడెక్కుతుంది. అందుకే ఛార్జ్ చేస్తున్న సమయంలో మొబైల్ వెనుక భాగం వేడిగా ఉంటుంది. అందుకు మీరు ఆందోళన పడకండి. కానీ మీరు రాత్రిపూట మొబైల్ ఛార్జ్‌లో ఉంచడం మంచిది కాదు.

Post a Comment

0 Comments

Close Menu