Ad Code

గేమింగ్ కంపెనీ సీఈఓగా ఏఐ బాట్ నియామకం !


హాంకాంగ్‌కు చెందిన గేమింగ్ కంపెనీ తమ సీఈఓగా ఏకంగా ఏఐ బాట్‌ను నియమించింది. నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్‌కు టాంగ్ యూ అనే ఏఐ బాట్‌ను సీఈఓగా కంపెనీ నియమించింది. నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్‌కు టాంగ్ యూ అనే ఏఐ బాట్‌ను సీఈఓగా కంపెనీ నియమించింది. కంపెనీ రాబడిని పెంచడంలో ఏఐ బాట్ సహకరించడం చర్చకు తావిస్తోంది. ఏఐ బాట్ సీఈఓగా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాబడి పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్ కూడా కొత్తపుంతలు తొక్కుతోంది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో జోష్ నెలకొనడం ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణా సామర్ధ్యాన్ని సరికొత్త స్ధాయికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ మేనేజ్‌మెంట్‌లో ప్రక్షాళన దిశగా ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ఏఐ చాట్‌బాట్‌ను అత్యున్నత స్ధానంలో నియమించినట్టు నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ పేర్కొంది. నాయకత్వ స్ధాయిలో నిర్ణయాలు తీసుకోవడం, హైలెవెల్ అనలిటిక్స్ సమీక్షించడం, రిస్క్‌లను అంచనా వేయడం వంటి కీలక బాధ్యతలను ఏఐ సీఈఓ టాంగ్ యూకు గేమింగ్ కంపెనీ అప్పగించింది. ఎలాంటి వేతనం లేకుండా వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు పనిచేసే కంపెనీ తొలి సీఈఓ టాంగ్ యూ కావడం గమనార్హం. ఏఐ చాట్‌బాట్‌ను సీఈఓగా నియమించడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగులందరికీ మెరుగైన పని ప్రదేశాన్ని సృష్టించడంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కంపెనీ ఆశిస్తోంది. టాంగ్ యూ నియామకంతో కంపెనీ ఏఐ ప్లస్ మేనేజ్‌మెంట్ వ్యూహాలకు పదునుపెట్టడంతో పాటు మెటావర్స్ సంస్ధగా కంపెనీని మలిచేందుకు దోహదపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu