Ad Code

పూజలు చేసే రోబోలు !


కొత్త కొత్త టెక్నాలజీలతో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన చాట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచంలో ట్రెండింగ్ గా మారింది. మనకు ఏ సందేహం వచ్చినా చాట్ జీపీటీని అడిగితే ఇట్టే సమాధానం చెబుతుంది. దీంతో పాటు రోబోల తయారీ కూడా ఇప్పుడు కొనసాగుతోంది. అచ్చం మనిషిలాగే రోబోలను తయారు చేస్తున్నారు. మనుషులు చేసే పనిని రోబోలో చేయిస్తున్నారు. తాజాగా దేవుడికి పూజలు చేయడానికి కూడా రోబోలను తయారు చేశారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన రోబోలు దేవుడికి పూజలు కూడా చేస్తున్నాయి. 2017లో, భారతదేశంలోని ఒక సాంకేతిక సంస్థ క్వార్ట్జ్‌కు గణపతి ఉత్సవంలో హారతి ఇవ్వడానికిరోబోటిక్ చేతిని ఆవిష్కరించింది. కేరళలోని ఒక దేవాలయం తన ఆచారాలను నిర్వహించడానికి యాంత్రిక ఏనుగును ప్రవేశపెట్టింది. దేవుడి పూజ కోసం రోబోలు తీసుకొస్తే ఇక పూజారులతో పని ఉండకపోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu