Ad Code

పోల్స్ ఫీచర్‌కి కీలక అప్‌డేట్ ?


వాట్సాప్ ఇప్పుడు గతంలో అందుబాటులోకి తీసుకొచ్చిన పోల్స్ ఫీచర్‌కి ఒక కీలకమైన అప్‌డేట్ అందించడానికి సిద్ధమవుతోంది. గతేడాది నవంబర్ నెలలో పోల్స్ క్రియేట్ చేసే సామర్థ్యాన్ని యూజర్లకు వాట్సాప్ ఆఫర్ చేసింది. దీని సాయంతో గ్రూప్/ పర్సనల్ కన్వర్జేషన్‌లో యూజర్లు పోల్ క్రియేట్ చేసి ఇతరుల అభిప్రాయాలను ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే వాట్సాప్ పోల్స్‌లో ఒకటే ఛాయిస్ కాకుండా అన్ని ఛాయిస్‌లకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా అలాకాకుండా ఒకటే ఛాయిస్‌ సెలెక్ట్ చేసుకునేలా వాట్సాప్ అప్‌డేట్ తీసుకురానుంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో  తాజాగా వెల్లడించింది. కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే పోల్స్‌ను ఒకే ఆప్షన్‌కు పరిమితం చేయవచ్చు. పోల్ రిజల్ట్స్‌లో గందరగోళం సృష్టించకుండా పోల్ పార్టిసిపెంట్లు ఒకే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. దీనివల్ల యస్ ఆర్ నో టైప్ ప్రశ్నల పోలింగ్ రిజల్ట్స్ మరింత స్పష్టంగా ఉంటాయి. అలాగే మల్టీపుల్ ఛాయిస్‌లు ఇచ్చి ఒకటే ఛాయిస్‌ సెలక్ట్ చేసుకోవాల్సినప్పుడు కూడా.. పార్టిసిపెంట్లను ఒక ఆప్షన్‌కే లిమిట్ చేయవచ్చు. అప్పుడు ఎక్కువమంది అభిప్రాయం ఏంటనేది పోల్స్ ద్వారా ఫుల్ క్లారిటీతో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న పోల్స్‌ ఫీచర్‌తో ఏదైనా క్వశ్చన్ క్రియేట్ చేసి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు.. గ్రూప్‌లోని పార్టిసిపెంట్లు ఒకటి కాకుండా తమకు నచ్చినన్ని ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల పాపులర్ ఆప్షన్ ఏంటనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఈ సమస్యకు కొత్త ఫీచర్ పరిష్కారం కానుంది. వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో ఇంప్రూవ్డ్ పోల్స్ ఫీచర్‌కి సంబంధించి రెండు స్క్రీన్‌షాట్లు పంచుకుంది. ఒక స్క్రీన్‌షాట్‌లో, వాట్సాప్ పోల్ కంపోజర్‌లో కొత్త టోగుల్‌ కనిపించింది. 'లిమిట్ టు ఓన్లీ వన్ ఛాయిస్'గా ఉన్న ఆ టోగుల్‌ ఆన్ చేస్తే ఒకటే ఆప్షన్‌ను పార్టిసిపెంట్లు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. తద్వారా ఫైనల్ రిజల్ట్‌లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పార్టిసిపెంట్లు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేలా టోగుల్‌ ఆఫ్ చేసి పోల్స్ పోస్ట్ చేయవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేలా ఉంటాయి. అలాంటప్పుడు ప్రస్తుతం పోల్స్ ఆఫర్ చేస్తున్న మల్టిపుల్ ఆప్షన్స్‌ సెలక్షన్ ఉత్తమంగా నిలుస్తుంది. ఈ కొత్త టోగుల్‌ ఫ్యూచర్‌ అప్‌డేట్‌లో అందుబాటులోకి రావచ్చని WABetaInfo వెల్లడించింది. ప్రస్తుతానికి పోల్స్‌ను ఒకే ఆప్షన్‌కు పరిమితం చేసే సామర్థ్యం అభివృద్ధి దశలో ఉంది. అందువల్ల యూజర్లు దీనికోసం ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.

Post a Comment

0 Comments

Close Menu