Ad Code

నానో కారును సోలార్‌ కారుగా మార్చాడు !


పశ్చిమ బెంగాల్‌కు చెందిన మనోజిత్ మాండల్ అనే వ్యాపారి సొంతంగా సోలార్ కారును తయారు చేసుకున్నాడు. తన వద్ద ఉన్న పాత నానో కారును సోలార్‌గా మార్చాడు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్ అవసరం లేదు. ఇంజిన్ కూడా ఉండదు. ఎరుపు రంగులో ఉన్న తన టాటా నానో కారుకు సోలార్ ఎలక్ట్రిక్ కారుగా పేరు పెట్టాడు మనోజిత్. తన కారు రూఫ్ టాప్‌పై సౌర పలకలను ఏర్పాటు చేశాడు. అవి సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి, బ్యాటరీలకు అందజేస్తాయి. ఆ బ్యాటరీల సాయంతో కారు ముందుకు వెళ్తుంది. మనోజిత్ తయారు చేసిన "సోలార్ కారు" కేవలం 30 నుంచి 50 రూపాయల ఖర్చరుతోనే దాదాపు 100 కిలోమీటర్లు నడుస్తుంది. ఒక్క కిలోమీటరుకు 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ కారులో ఇంజిన్ లేకపోవడం వల్ల స్టార్ట్ చేసినా శబ్ధం రాదు. ఇంజిన్ లేకపోయినా, గేర్ సిస్టమ్ ఉంది. నాలుగో గేర్‌లో దాదాపు సైలెంట్‌గా గంటకు 80 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లగలదు. మనోజిత్ మాండల్ స్వస్థలం బంకురా జిల్లా కట్జురిదంగా. ఏదైనా కొత్తగా చేయలని  చిన్నప్పటి నుంచి కలగనేవాడు. అందుకే పెట్రో ధరలపై అందరిలా గగ్గోలు పెట్టకుండా సొంతంగా సౌర శక్తితో నడిచే కారును తయారు చేసుకున్నాడు. మనోజిత్ తన కారును మార్చే సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఎంతో కష్టపడి చివరకి అనుకున్నది సాధించాడు. బంకురా వీధుల్లో మనోజిత్ కారు తిరుగుతుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటి ఇది ఎలక్ట్రిక్ కారా? అని ప్రశ్నిస్తే.. కాదు.. సోలార్ ఎలక్ట్రిక్ కారు అని సమాధానమిస్తాడు. పెట్రోల్ అవసరం లేదు. ఎండ ఉంటే చాలు..ఎక్కడికైనా.. ఎంత దూరమైనా వెళ్లవచ్చని చెబుతాడు. ఇలాంటి అద్భుతమైన కారును తయారు చేసినా  ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదని, తన ప్రతిభను గుర్తించలేదన్న చిన్న నిరుత్సాహం ఆయనలో ఉంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే  తక్కువ ధరకే ప్రజలకు సోలార్ కారును ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మనోజిత్ మాండల్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu