Ad Code

గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారు తస్మాత్ జాగ్రత్త !


గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఇతరులకు మోసగాళ్లు డబ్బులు పంపిస్తారు. తర్వాత కాల్ చేసి డబ్బులు పొరపాటుగా మీ అకౌంట్‌కు వచ్చాయని చెబుతారు. అటుపైన ఆ డబ్బులు తిరిగి పంపాలని కోరతారు. అంటే మీరు ఆ డబ్బులు తిరిగి వారికి పంపిస్తే తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మోసగాళ్లు వందలు లేదా వేలలో డబ్బులు పంపరు. కేవలం రూ.10 లేదా రూ. 50 ఇలా పంపిస్తారు. చిన్న అమౌంట్ కదా అని మీరు తిరిగి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు డబ్బులు వెనక్కి పంపితే.. అప్పుడు మీ మాల్వేర్ ఎటాక్ బారిన పడాల్సి వస్తుంది. ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు పవర్ దుగ్గల్ మాట్లాడుతూ.. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మాల్వేర్ అండ్ హ్యుమన్ ఇంజినీరింగ్ స్కామ్‌గా దీన్ని పిలుస్తారని పేర్కొన్నారు. ఈ విధానంలో మోసగాళ్లు మీ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తారని, పొరపాటుగా వచ్చాయని కాల్ చేస్తారని, ఆ డబ్బులు తిరిగి వెనక్కి పంపాలని కోరతారని వివరించారు. మీరు డబ్బులు వెనక్కి పంపిస్తే.. మీ అకౌంట్ హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు. ఎప్పుడైతే ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లు ఇలా డబ్బులు వెనక్కి పంపిస్తే.. అప్పుడు వారి డేటా మొత్తం  మోసగాళ్లకు చేరతాయి. అప్పుడు ఈ వివరాలతో మోసగాళ్లు ఫోన్‌పే, గూగుల్ పే యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారని వివరించారు. అందువల్ల ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెనక్కి డబ్బులు పంపించకుండా దగ్గరిలోని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి డబ్బులు ఇవ్వడం బెటర్. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించండి. ఇలా మీరు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu