Ad Code

సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు !


నెదర్లాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ స్క్వాడ్ మొబిలిటీ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. ఈ కంపెనీ ఇటీవలే సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. సోలార్ సిటీ మినీ ఒక రెండు-సీట్ల ఎలక్ట్రిక్ కారు, ఇది పూర్తిగా సోలార్ పవర్‌తో నడుస్తుంది. యూరోపియన్ యూనియన్ దేశాలలో ఈ ఎలక్ట్రిక్ కారును నడిపేందుకు డ్రైవర్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ప్రైవేట్ కొనుగోలుదారులు, ఫ్లీట్ కంపెనీల కోసం స్క్వాడ్ మొబిలిటీ ఈ మినీ ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ఈ సోలార్-ఛార్జ్డ్ కాంపాక్ట్ కారు త్వరలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య అంతరాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన 'స్క్వాడ్ మొబిలిటీ' సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి సోలార్ కారును రూపొందించింది. పట్టణ రవాణాకు సరిపోయేంత చిన్నదిగా రూపొందించబడిన ఈ కారు పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్తు ఇంజిన్‌ను నడుపుతున్న బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఒక్కసారి బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నిరంతరం ప్రయాణించవచ్చు. ఇటీవలే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సోలార్ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రీ-ఆర్డర్‌పై ఈ కార్లను తయారు చేస్తున్నట్లు 'స్క్వాడ్ మొబిలిటీ' తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu