Ad Code

నథింగ్ కంపెనీ మరో కొత్త ఫోన్‌ ?


నథింగ్ కంపెనీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ వార్త ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది ఇందులో కొత్త విషయం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఫోన్ గురించి ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ అనుకోకుండా నథింగ్ ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని వెల్లడించారు. ఇది వన్ ప్లస్ 11ఆర్2కి కూడా శక్తినిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో నడిచే నథింగ్ ఫోన్ (1)తో పోలిస్తే పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. నథింగ్, వారి తదుపరి స్మార్ట్‌ఫోన్‌ను నథింగ్ ఫోన్ (2) అని పిలుస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2023లో, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ చిప్‌సెట్ నథింగ్ ఫోన్‌కు శక్తినిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ 1 లో గ్లిఫ్ డిజైన్‌ను అందిస్తున్నారు. నథింగ్ ఫోన్ (2)లో కూడా ఈ విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నారు. అయితే స్పెసిఫికేషన్లు మాత్రం గణనీయంగా మారవచ్చని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 2 మొదటి వెర్షన్ కంటే ప్రీమియంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఇచ్చే అధునాతన ఫీచర్ల వల్లే ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ (2) ప్రపంచవ్యాప్తంగా 2023 మూడో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటుననాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ ఏA065 అని లీకులు చెబుతున్నాయి. అలాగే ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వినియోగదారులను అలరించనుంది. 

Post a Comment

0 Comments

Close Menu