Ad Code

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు సవాలు విసురుతున్న బింగ్‌ !


ఈ రోజుల్లో ఏదైనా సందేహం వస్తే, ఠక్కున పక్కవారు ఇచ్చే సలహా గూగుల్‌ లో సెర్చ్ చేయమని, ఇంటర్నెట్‌కి గూగుల్‌ మరో పేరులా మారిపోయింది. అంతలా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ యూజర్లకు దగ్గరైంది. కానీ OpenAI, మైక్రోసాఫ్ల్ కలయికలో వచ్చిన చాట్‌జిపిటి గూగుల్‌కు సవాలు విసురుతోంది. మైక్రోసాఫ్ట్‌ తమ బింగ్‌ సెర్చ్‌ ఇంజిన్‌కు చాట్‌జిపిటి సపోర్ట్‌ను యాడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పు తర్వాత బింగ్‌కి యూజర్ల ట్రాఫిక్‌ పెరిగిందని సిమిలర్‌వెబ్‌ అనలిటిక్స్‌ డేటా చెబుతోంది. గూగుల్‌కు గట్టిపోటీ ఇస్తోందని పేర్కొంది. మార్చి 20వ తేదీ వరకు ఉన్న డేటా ప్రకారం.. మైక్రోసాఫ్ట్ ఫిబ్రవరి 7న AI- పవర్డ్ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి బింగ్‌ పేజీ విజిట్స్ 15.8 శాతం పెరిగాయి. మరోవైపు Alphabet Inc యాజమాన్యంలో ఉన్న గూగుల్‌ పేజీ విజిట్స్ అదే కాలంలో దాదాపు ఒక శాతం తగ్గాయి. ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవడంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. చాట్‌జిపిటి లాంచ్‌ అయిన వెంటనే గూగుల్‌ తన బార్డ్‌ చాట్‌బాట్‌ గురించి రివీల్‌ చేసింది. రెండు కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. అయితే తాజా గణాంకాలు గూగుల్‌తో జరుగుతున్న పోటీలో మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించిందని చెబుతున్నాయి. చాట్‌జిపిటి టెక్నాలజీ సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్‌ తన ప్రొడక్టులకు యాడ్‌ చేస్తోంది. ఏఐ రంగంలో చాట్‌జిపిటిని నిపుణులు 'ఐఫోన్ మూమెంట్‌'తో పోలుస్తున్నారు. 120 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన సెర్చింగ్‌ మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా 80 శాతానికి పైగా వాటాని గూగుల్‌ శాసిస్తూ వచ్చింది. తాజా గణాంకాలు మైక్రోసాఫ్ట్ ప్రాబల్యాన్ని సంపాదించడానికి అరుదైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. డీఏ డేవిడ్‌సన్ & కో అనలిస్ట్ గిల్ లూరియా ప్రకారం.. బింగ్ రాబోయే నెలల్లో సెర్చ్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉంది. గూగుల్ తాను అందిస్తున్న సేవల్లో ఏఐ టెక్నాలజీని చేర్చడం ఆలస్యమవుతున్న కొద్దీ మైక్రోసాఫ్ట్‌ ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏఐ పవర్డ్‌ బింగ్‌ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ వినియోగదారులకు అందుబాటులో ఉంది. గూగుల్‌ తన చాట్‌బాట్ బార్డ్‌కు గత మంగళవారం లిమిటెడ్‌ యాక్సెస్‌ అందించింది. గూగుల్ మార్కెట్ షేర్‌లో బింగ్‌ పదో వంతు కంటే తక్కువగా ఉంది. ఒక శాతం లేదా రెండు శాతం వినియోగదారులు చేరినా మైక్రోసాఫ్ట్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. AI టెక్నాలజీని యాడ్‌ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బింగ్ యాప్ డౌన్‌లోడ్‌లు ఎనిమిది రెట్లు పెరిగాయని యాప్ రీసెర్చ్‌ కంపెనీ Data.ai పేర్కొంది. అదే సమయంలో గూగుల్‌ సెర్చ్‌ యాప్ డౌన్‌లోడ్‌లు రెండు శాతం తగ్గాయి. సెర్చ్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ ఇటీవల లాభాలు పొందినప్పటికీ, 2000ల ప్రారంభంలో టాప్‌ సెర్చ్‌ ఇంజిన్‌ యాహూను అధిగమించిన గూగుల్, త్వరగా కోలుకోగలదని కొందరు అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా గూగుల్‌ టాప్‌ ప్లేస్‌ నిలబెట్టుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. ఇతరుల కంటే గూగుల్ ర్యాంకింగ్ అల్గోరిథం పోటీతత్వాన్ని కలిగి ఉంటుందని దక్షిణ కొరియాలోని మిరే అసెట్ సెక్యూరిటీస్‌లో అనలిస్ట్‌ యోంగ్‌జీ జియోంగ్ చెప్పారు. యాహూని దాటడంలో గూగుల్ అల్గారిథం సహాయపడిందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu