Ad Code

నో బోనస్ - నో రిక్రూట్మెంట్ - నో లేఆఫ్స్ ?


యాపిల్ కంపెనీలో మార్చి నెలలో రావాల్సిన బోనస్ ఇంకా ప్రకటించలేదంట. బోనస్ లు లేవని అంతర్గ చర్చలు నిర్ణయం తీసుకున్నారని, ఈసారి బోనస్ లు ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచన చేస్తుందంట. ఇదే సమయంలో కొత్త రిక్రూట్ మెంట్ ను నిలిపి వేసిందంట. కొత్తగా ఎవర్నీ తీసుకోవద్దని, ఉన్న ఉద్యోగులతో పని చేయించుకోవాలని ఆయా విభాగాల హెడ్స్ కు సమాచారం ఇచ్చారంట !. 2020 నుంచి 2022 మధ్య కాలంలో యాపిల్ 7 వేల మందిని నియమించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నా, ఈ సంఖ్య లక్షా 60 వేల మంది అని కొన్ని పత్రికలు కథనాలను ప్రచురించాయి. యాపిల్ అధికారికంగా చెబుతున్నది మాత్రం 7 వేల మంది మాత్రమే అంటోంది. యాపిల్ కంపెనీల బోనస్ లు కట్ చేయటంతోపాటు కొత్త రిక్రూట్ మెంట్ లేకుండా.. ప్రమోషన్స్ లేకుండా యధాతధ స్థితి కొనసాగించాలని నిర్ణయించిందంట. ఈ కీలక నిర్ణయంతో ఉద్యోగులు ఎవర్నీ తొలగించాల్సిన అవసరం ఉండదని భావిస్తుంది కంపెనీ. బ్యాలెన్స్ షీట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. నగదు నిల్వలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కాలని యాపిల్ నిర్ణయించింది. బోనస్ లేకపోయినా.. ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు.. లే ఆఫ్స్ లేకుండా ఉంటే చాలు.. ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో అంటున్నారంట యాపిల్ ఎంప్లాయీస్..ఓ వైపు గూగుల్, ఫేస్ బుక్ తోపాటు ఇతర కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తీసి వేస్తున్న సమయంలో.. యాపిల్ నిర్ణయం బెటర్ గా కనిపిస్తుంది ఆ కంపెనీ ఉద్యోగులకు.. బోసన్ లేకపోతే లేకపోయింది ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలు అంటున్నారంట !...

Post a Comment

0 Comments

Close Menu