Ad Code

అద్దెకు సైకిళ్లు !


గ్రో క్లబ్ అనే కంపెనీ సైకిల్ రెంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న పిల్లల దగ్గర నుంచి, యువత వరకు వారికి నచ్చిన సైకిల్ అద్దెకు తీసుకోవచ్చు. రెంట్ కూడా నెలకు చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలు పెరిగే కొద్దే వారు వారికి నచ్చిన సైకిల్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. డోర్‌స్టెప్ సర్వీసులు, మెయింటెనెన్స్ ఉంటుంది. 77 శాతం డబ్బు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. జీరో వేస్టేజ్. ఫ్రీ అప్‌గ్రేడ్ ఫెసిలిటీ ఉంటుంది. కంపెనీ 15 రకాల సైకిళ్లను ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ విధానంలో కస్టమర్లకు రెంట్‌కు అందుబాటులో ఉంచింది. ఇందులో మొదటిది వొయగేర్ 20 యూ సైకిల్. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 500 నుంచి ప్రారంభం అవుతోంది. 6 నుంచి 10 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి ఈ సైకిల్ అనువుగా ఉంటుంది. ఎక్స్‌ప్లోర్ 24 యూ అనే మోడల్ కూడా ఉంది. ఈ సైకిల్ 9 నుంచి 14 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి అనువుగా ఉంటుంది. దీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా ఛాలెంజన్ 26 యూ అనే సైకిల్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కూడా రూ. 549 నుంచి ప్రారంభం అవుతోంది. ఇవ్వన్నీ యూనిసెక్స్ సైకిళ్లు. ఎవరైనా నడపొచ్చు. కిడ్స్ సైకిల్స్ విషయానికి వస్ 4 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు వయసు కలిగిన వారికి ఇవి అనువుగా ఉంటాయి. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 250 నుంచి ప్రారంభం అవుతోంది. బాయ్స్ సైకిళ్ల విషయానికి వస్తే వీరికి కూడా 4 సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. 6 నుంచి 12 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ సైకిళ్ల ఉపయోగించొచ్చు. వీటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 500 నుంచి ఉంది. గర్ల్స్ సైకిల్స్ విషయానికి వస్తే.. వీరికి కూడా నాలుగు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరేళ్ల నుంచి 12 ఏళ్లు వయసు కలిగిన వారు ఈ సైకిళ్లు ఉపయోగించొచ్చు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 500 నుంచి పడుతుంది. ఫ్లైయర్ 14టీ అనే సైకిల్ రెంట్‌కు తీసుకోవాలని భావిస్తే.. నెలకు రూ. 250 చొప్పున మీరు ఒకేసారి రూ. 3 వేలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకేసారి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు చేస్  మీకు 3 నెలలు ఉచితంగా రెంట్ లేకుండా సైకిల్ నడిపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్సిగో ద్వారా మీరు పేమెంట్ చేస్తే.. మీకు రూ. 1000 వరకు తగ్గింపు కూడా వస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు మీకు నచ్చిన సైకిల్ పొందొచ్చు. తొలి రెండు సర్వీసులు ఉచితంగా లభిస్తాయి. లైఫ్ టైమ్ వారంటీ, ఫ్రీ రిప్లేస్‌మెంట్ ఆఫ్ మెకానికల్ పార్ట్స్, కొత్త సైకిల్ అప్‌గ్రేడ్ అయితే 10 శాతం తగ్గింపు వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే 24 నెలల సబ్‌స్క్రిప్షన్ తర్వాత కావాలనుకుంటే ఆ సైకిల్ డిస్కౌంట్ రేటుతో కొనొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu