Ad Code

వాట్సాప్ బిజినెస్‌లో 'బూస్ట్ స్టేటస్' షార్ట్‌కట్ !


వాట్సాప్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. దీంట్లో ఉన్న ఫీచర్లతో వ్యాపారాలను చాలా సులభంగా చేసుకోగలుగుతున్నారు. అయితే వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా వ్యాపారులు మరింత సక్సెస్ అయ్యేందుకు సరికొత్త ఫీచర్లను కంపెనీ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ బూస్ట్ స్టేటస్ పేరుతో ఒక సరికొత్త షార్ట్‌కట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం iOS, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లకు ఈ ఫీచర్ రిలీజ్ అవుతున్నట్లు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది.  చాలా రోజులుగా అనేక బిజినెస్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా తమ ప్రొడక్ట్స్ ప్రచారం చేస్తూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే ఫేస్‌బుక్‌లో ఇంకా యాడ్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టని వ్యాపారాలను అటువైపు మళ్లించాలని వాట్సాప్ నిర్ణయించింది. అందుకే వాట్సాప్‌లో పెట్టే స్టేటస్‌ను ఈజీగా ఫేస్‌బుక్‌లో అడ్వర్టైజ్ చేయడానికి కొత్త షార్ట్‌కట్‌ను తీసుకొచ్చింది. ఈ షార్ట్‌కట్‌ ద్వారా పోస్ట్ చేసే యాడ్స్‌తో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. సేల్స్ పెంచుకోవచ్చు. స్టేటస్ అప్‌డేట్‌ను పోస్ట్ చేసిన తర్వాత కనిపించే కొత్త షార్ట్‌కట్, ఇతర మెటా యాప్‌ల కోసం యాడ్‌లను రూపొందించేలా వ్యాపారులను ప్రోత్సహిస్తుంది. వారి ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేయడానికి మరిన్ని ఆప్షన్స్ అందిస్తుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో బూస్ట్ స్టేటస్ షార్ట్‌కట్‌కి సంబంధించి రెండు స్క్రీన్‌షాట్స్ షేర్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్స్‌ ప్రకారం, కొత్త షార్ట్‌కట్‌తో ఇప్పుడు బిజినెస్ యూజర్లు వాట్సాప్‌లో వారి స్టేటస్ అప్‌డేట్స్‌ నుంచి యాడ్స్ క్రియేట్ చేయవచ్చు. స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేసిన తర్వాత వాటిని ఫేస్‌బుక్ యాప్‌కి ఫార్వార్డ్ చేయడానికి షార్ట్‌కట్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. తరువాత అక్కడ వారు ప్రకటనను ఎడిట్ చేయవచ్చు, డిస్క్రిప్షన్ రాయవచ్చు. ఆ ప్రకటనను ఎంతకాలం రన్ కావాలో ఎంచుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ యాప్‌లోని కొంతమంది బీటా టెస్టర్లు ఫేస్‌బుక్ యాప్‌కి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ప్రకటనలను సృష్టించడానికి ఎక్స్‌ట్రా షార్ట్‌కట్‌ను కూడా పొందవచ్చని WABetaInfo వెల్లడించింది. వాట్సాప్‌లో స్టేటస్ అప్‌డేట్‌ను బూస్ట్ చేయడం వల్ల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో మాత్రమే యాడ్స్ క్రియేట్ అవుతాయి. ఈ స్టేటస్‌ యాడ్స్ ఇతర వాట్సాప్ యూజర్లకు షేర్ కావని గమనించాలి. ఇక iOS, Androidలో వాట్సాప్ బీటా లేటెస్ట్ బిజినెస్ అప్‌డేట్స్‌ ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది రాబోయే వారాల్లో యూజర్లందరికీ రిలీజ్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu