Ad Code

టాటా కార్లపై భాబంపర్ డిస్కౌంట్లు !


వివిధ మోడళ్లపై టాటా భారీ ఆఫర్లను అందిస్తోంది. 2022, 2023లో తయారైన టాటా హారియర్, సఫారి, ఆల్ట్రోజ్, టియాగో మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి నెలలో పరిమిత కాలం మాత్రమే  అందుబాటులో ఉంతాయి.  టాటా ఆల్ట్రోజ్ 2023 పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్‌పై కూడా రూ.25,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఈ వెహికల్ 2022 స్టాక్‌ పెట్రోల్ వేరియంట్‌పై రూ.20వేలు, డీజిల్ వేరియంట్‌పై రూ.35వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 2022 DCA పెట్రోల్ ఆటోమేటిక్ ఆల్ట్రోజ్ మోడల్ రూ.30,000 తగ్గింపుతో వస్తుంది. టాటా ఆల్ట్రోజ్ కారు మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ i20, టయోటా గ్లాంజా వంటి మోడళ్లతో పోటీపడుతుంది. లేటెస్ట్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ CNG వేరియంట్‌పై టాటా మోటార్స్ రూ.30వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్‌పై రూ.25వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 2022 స్టాక్‌పై కంపెనీ రూ.40,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి ఇగ్నిస్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ వంటి మోడళ్లతో పోటీపడుతున్న టాటా టిగోర్ మోడల్, మార్కెట్‌లో పాపులర్ అయింది. ఈ నెలలో 2023 టాటా హారియర్ వెహికల్‌పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. అంటే మొత్తం రూ. 35,000 వరకు వెహికల్ ధర తగ్గుతుంది. హారియర్ 2022 స్టాక్‌పై వేరియంట్‌ను బట్టి రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో రన్ అయ్యే హారియర్ SUV, స్మూత్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది. సఫారి తర్వాత టాటా లైనప్‌లో పాపులర్ మోడల్‌గా హారియన్ గుర్తింపు పొందింది. టాటా సఫారి SUV 2023 వేరియంట్ ఏకంగా రూ.35,000 టోటల్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. రూ.10వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో లేటెస్ట్ మోడల్ టాటా సఫారి వెహికల్‌ను కొనుగోలు చేయవచ్చు. సఫారి 2022 స్టాక్‌పై టాటా మోటార్స్ రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. టాటా సఫారి SUV 170hp, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రన్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu