Ad Code

ఆడి ఎలక్ట్రిక్ సైకిల్ !


ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆడి కూడా ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకువచ్చింది. ఆర్ఎస్ క్యూ ఇట్రాన్ ఈ2 ఎలక్ట్రిక్ డాకర్ ర్యాలీ రేసర్ స్పూర్తితో ఆడి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకు వచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటలీకి చెందిన ఫ్యాంటిక్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది. ఎక్స్ఎంఎఫ్ 1.7 ఆధారంగా దీన్ని రూపొందించింది. ఇందులో 250 వాట్ బ్రోస్ మోటార్ ఉంటుంది. హార్లీ డేవిడ్‌సన్ సీరియల్ 1 బాష్‌లో ఈ మోటార్‌ను గమనించొచ్చు. ఇందులో కంపెనీ 720 వాట్ బ్యాటరీని అమర్చింది. ఆడి కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ రేంజ్ ఎంత ఉంటుందో వెల్లడించలేదు. ఇంకా దీని టాప్ స్పీడ్ కూడా ఎంత ఉంటుందో ప్రకటించలేదు. అయితే దీని రేంజ్ 95 మైల్స్ కన్నా ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆడి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌లో 4 లెవెల్స్ ఎలక్ట్రిక్ అసిస్టెన్స్ ఉంటుంది. మైల్డ్ మోడ్ నుంచి ఆల్ ఔట్ బూస్ట్ మోడ్ వరకు ఇతర బ్రోస్ పవర్డ్ ఇబైక్స్ మాదిరిగానే ఇందులో కూడా ఉంటుంది. ఈ ఇబైక్ ఫ్రేమ్ డిజైన్ విషయానికి వస్తే.. అల్యూమినియంతో తయారు చేశారు. అలాగే అధిక నాణ్యత కలిగిన విడి భాగాలను ఉపయోగించారు. బ్రేకింగ్ ఇన్.కా.ఎస్ డిస్క్ బ్రేక్స్, ఓహ్లిన్స్ ఫోర్క్ అండ్ షాక్, శ్రామ్ కాంపొనెంట్స్ ఫర్ చెయిన్, షిఫ్టర్స్ అండ్ డెరైల్యూర్ వంటివి ఉన్నాయి. ఇందులో ప్రీమియం ఇటాలియన్ టచెస్ ఉన్ని. విట్టోరియా టైర్స్, షెల్లా ఇటాలియ శ్యాడల్ వంటి వాటిని గమనించొచ్చు. ఆడి ఎలక్ట్రిక్ సైకిల్ మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. వీటి ధర యూకేలో 8499 నుంచి 10,200 డాలర్ల వరకు ఉంది. ఆడి ఎక్స్‌క్లూజివ్ డిజైన్, అధిక సామార్థ్యం కలిగిన బ్యాటరీ, పేరున్న విడి భాగాలు వంటి వాటి పరంగా చూస్తే ధర ఈ స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. మన కరెన్సీలో చెప్పుకుంటే ఈ ఆడి ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ 8 లక్సలకు పైగానే ఉందని చెప్పుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu