Ad Code

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వాలిడిటీ తగ్గింపు !


బీఎస్ఎన్ఎల్ తాజాగా  ప్రీపెయిడ్  ప్లాన్స్ రీచార్జ్ ధరలను ఇన్‌డైరెక్ట్‌గా పెంచింది. దీంతో కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా నాలుగు  ప్రీపెయిడ్  ప్లాన్స్ వాలిడిటీ తగ్గించేసింది. నేరుగా ధరలు పెంచకుండా ఇలా వాలిడిటీని తగ్గించింది. పరోక్షంగా టారిఫ్ ధరలు పెరిగిన ప్లాన్స్‌ను ఒకసారి గమనిస్తే.. ఇందులో రూ. 107, రూ. 197, రూ. 397, రూ. 797 ప్లాన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే కంపెనీ ఇప్పుడు వీటి వాలిడిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇలా చేయడం ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టారిఫ్ ధరలు పెంచితే ఆ ప్రభావంతో వేరే ప్లాన్స్‌ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది. అదే టారిఫ్ ధరలు పెంచకుండా వాలిడిటీ తగ్గిస్త అప్పుడు యూజర్లు పదే పదే ఆ ప్లాన్స్‌ను రీచార్జ్ చేసుకుంటారు. దీని వల్ల కంపెనీ ఆదాయం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రూ. 107 ప్లాన్ విషయానికి వస్తే.. దీని వాలిడిటీ 40 రోజులు. అయితే ఇప్పుడు దీని వాలిడిటీ 35 రోజులకు తగ్గింది. ఇతర బెనిఫిట్స్ ఎప్పటిలాగానే ఉన్నాయి. 3 జీబీ డేటా, 200 నిమిషాల కాల్స్ వంటివి పొందొచ్చు. రూ. 197 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వాలిడిటీ ఇది వరకు 84 రోజలుగా ఉండేది. అయితే ఇప్పడు వాలిడిటీ 70 రోజులకు తగ్గింది. ఈ ప్లాన్ కింద కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. రూ. 397 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వాలిడిటీ ఇది వరకు 180 రోజులు. అయితే ఇప్పుడు కంపెనీ దీన్ని 150 రోజులకు తగ్గించింది. ఈ ప్లాన్‌పై ఇది వరకు వచ్చే ఫ్రీబీస్ 60 రోజులు ఉండేవి. ఇప్పుడు ఇవి 30 రోజుల వరకే పరిమితం అయ్యాయి. అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటి ఫ్రీబీస్ ఉంటాయి. ఇంకా పీఆర్‌బీటీ సర్వీస్ ఉచితం. ఇక చివరిగా రూ. 797 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఉచితంగా ఫ్రీబీస్ 60 రోజులు లభిస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ వాలిడిటీ 300 రోజులకు తగ్గింది. ఫ్రీబీస్ రూపంలో అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వంటివి వస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu