Ad Code

వివో V27e ఫోన్‌ విడుదల !


దేశీయ మార్కెట్లోకి వివో  మరో మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. వివో V27e పేరుతో వచ్చిన ఈ మిండ్ రేంజ్‌ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. వివో V27e మోడల్ సింగిల్ వేరియంట్‌ (8GB+256GB)లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. మలేషియన్ కరెన్సీలో RM 1,299(దాదాపు రూ.23,400). V27 సిరీస్‌ను కంపెనీ ఇటీవల భారత్‌లో లాంచ్ చేసింది. అయితే కేవలం రెండు మోడల్స్ Vivo 27, Vivo 27 Pro మాత్రమే ఈ సిరీస్‌లో ఉన్నాయి. దీంతో వివో V27e మోడల్‌ను కేవలం మలేషియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లుగా టెక్ వర్గాలు భావిస్తున్నాయి. వివో V27e స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌, కెపాసిటివ్ మల్టీ-టచ్ సపోర్ట్‌తో 6.62-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 2,400 × 1,080 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB RAM +256GB స్టోరేజ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ SIMకి సపోర్ట్ చేస్తుంది. వివో V27eలో ఆప్టిక్స్ కోసం రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. OISతో కూడిన 64 MP ప్రైమరీ సెన్సార్‌, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో యూనిట్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 32 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. సింగిల్ కలర్ టెపరేచర్‌తో ట్రిపుల్ రియర్ ఫ్లాష్‌ కూడా ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 66W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 4,600 mAh బ్యాటరీ ఉంటుంది. 4G స్మార్ట్‌ఫోన్‌లో మైక్రో SD కార్డ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్, గైరోస్కోప్‌ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లోని Vivo V27e బరువు 185g, 162.51 × 75.81 × 7.70mm మందంగా ఉంటుంది. లావెండర్ పర్పుల్ కలర్‌ ఫోన్ బరువు 186g, 162.51 × 75.81 × 7.80mm మందంగా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌గా 4G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, USB-C పోర్ట్, NFC, GPS వంటి వాటికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోరీ బ్లాక్, లావెండర్ పర్పుల్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌లో మలేషియన్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. వివో మలేషియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu