Ad Code

11న ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ విడుదల


దేశీయ మార్కెట్లోకి టెక్నో 'ఫాంటమ్ వీ ఫోల్డ్ 5జీ' ఫోన్ ఈ నెల 11న విడుదల చేయనున్నది. `మేడ్ ఇన్ ఇండియా` కింద భారత్‌లోనే తమ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. టెక్నో తన `ఫాంటం వీ ఫోల్డ్ 5జీ` ఫోన్, డిజైన్‌, స్పెషిఫికేషన్స్‌ను తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో వస్తున్నది. హెచ్ఐఓఎస్  ఫోల్డ్ వర్షన్ విత్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఏప్రిల్ 12 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. లాంఛింగ్ ఆఫర్గా రూ.77,777లకు కొనుగోలు చేయొచ్చు. 6.42-అంగుళాల కర్వ్‌డ్ స్క్రీన్ డిస్‌ప్లే, డిస్‌ప్లే 7.85-అంగుళాలు విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ 2కే + విత్ 2,296×2,000 పిక్సెల్ రిజూల్యూషన్‌. 256 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభ్యం.రెండు వేరియంట్లలోనూ 12జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ రామ్ కూడా ఉంటుంది.5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌. 15 నిమిషాల్లో 40 శాతం, 55 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్‌. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌, 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 1/1.3 అంగుళాల సెన్సర్ సైజ్ అండ్ ఎఫ్‌/1.8 అపెర్చర్‌. 50-మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్ అండ్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌, 13-మెగా పిక్సెల్ విత్ 120 డిగ్రీ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌. 32 మెగా పిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరా విత్ ఏ పంచ్ హోల్ నాచ్ ఇన్ ది డిస్‌ప్లే ఆఫ్ ది ఫోల్డబుల్ కవర్‌.

Post a Comment

0 Comments

Close Menu