Ad Code

రెడ్‌మీ నోట్ 12 సేల్ ప్రారంభం !


దేశీయ మార్కెట్లో రెడ్‌మీ నోట్ 12 4జీ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమైంది. బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్‌లో లభ్యమవుతుంది  ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. లేదా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.1,500 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్‌పై రూ.13,300 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్‌మీ నోట్ 12 4జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్‌తో లభిస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, 4 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాల పోర్ట్‌రైట్, పనోరమా, ప్రో మోడ్, నైట్ మోడ్, కస్టమ్ వాటర్‌మార్క్, డాక్యుమెంట్ మోడ్, హెచ్‌డీఆర్, ఏఐ సీన్ డిటెక్షన్, టైమ్ బరస్ట్, గూగుల్ లెన్స్, మూవీ ఫ్రేమ్, వాయిస్ షటర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో పోర్ట్‌రైట్, హెచ్‌డీఆర్, టైమ్ బరస్ట్, మూవీ ఫ్రేమ్, వాయిస్ షటర్, పామ్ షటర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ 5.0 లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu