Ad Code

ఐఫోన్‌ 14 లేకుండా బతకలేనన్న ఈవ్ జాబ్స్ !


టెస్ట్ సిరీస్‌ ఐఫోన్‌ 14 లాంచ్‌ అయినప్పుడు మిశ్రమ స్పందన కనిపించింది. కొత్త సిరీస్ కూడా ఐఫోన్‌ 13 మోడల్‌ తరహాలోనే ఉందని, పెద్దగా ఛేంజెస్‌ లేవని చాలా మంది ఆరోపించారు. వాస్తవానికి రిలీజ్ అయిన కొత్తలో ఐఫోన్‌ 14 సిరీస్ సేల్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు అందరూ ఐఫోన్‌ 15 కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఐఫోన్‌ 14 చర్చ ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ తాను ఐఫోన్‌ 14 లేకుండా జీవించలేనని చెప్పింది. యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు నలుగురు సంతానం కాగా, వారిలో ఈవ్ జాబ్స్ నాలుగో సంతానం. ఆమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఆమె మోడలింగ్ చేసింది, గుర్రపుస్వారీపై కూడా పట్టు ఉంది. ఈవ్ జాబ్స్ తాజాగా 'ది స్ట్రాటజిస్ట్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ వస్తువులు లేకుండా జీవించడం కష్టం? అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. ఐఫోన్ 14 గురించి ఈవ్‌ జాబ్స్‌ మాట్లాడుతూ.. 'నేను క్లుప్తంగా వివరిస్తాను. ఇది క్రియేటివ్‌ పర్సన్స్‌కు ఉపయోగపడే టూల్‌. అమితంగా ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చిన మాస్టర్‌పీస్. ఇది మన జీవితాలను గడిపిన విధానాన్ని మార్చింది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, నా అన్ని ఫీలింగ్స్‌ను ఒక్క మాటలో తెలపాలంటే.. ఐఫోన్‌ 14 జీనియస్‌' అని చెప్పారు. గత సంవత్సరం ఇదే ఐఫోన్‌ 14ని ఈవ్ జాబ్స్ ఎగతాళి చేయడం గమనార్హం. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 2022 సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 లాంచ్‌ అయింది. ఆ సందర్భంలో ఈవ్ జాబ్స్ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్‌ చేశారు. అందులో ఒక వ్యక్తి ఒకే రకమైన చొక్కాలను ధరించి పోజులు ఇస్తున్నట్లు ఉంది. యాపిల్‌ కొత్త సిరీస్ రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నట్లు ఆమె వ్యంగ్యంగా చెప్పింది.

Post a Comment

0 Comments

Close Menu