Ad Code

ఏప్రిల్ 17న గెలాక్సీ ఎం 14 5జీ విడుదల !


దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ మరొక స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేయాలని చూస్తోంది. ముఖ్యంగా వివో మరియు షియోమీ కంటే తక్కువ ధరలో 5G ఫోన్‌లను పరిచయం చేయబోతుంది. గెలాక్సీ ఎం 14 5జీ  స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 17న లాంచ్ చేయబోతోంది. స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ sAMOLED డిస్‌ప్లేతో వస్తుందని చెప్పబడింది. పూర్తి HD మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. 1080 x 2408 పిక్సెల్‌లు, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో సహా పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ రాబోతోంది. వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో కెమెరా + 2MP డెప్త్ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. ఇంకా ఈ కొత్త ఫోన్ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ను వాడటానికి చాలా వేగంగా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది మరియు ఇది తాజా ఫీచర్లను తీసుకువస్తుంది. 4GB/6GB RAM మరియు 64GB/128GB స్టోరేజ్ లతో లాంచ్ చేయబడుతుంది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ సపోర్ట్‌ని కూడా కలిగి ఉందని చెప్పబడింది. మరియు ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 206 గ్రాముల బరువుతో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కాబట్టి ఛార్జింగ్ గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందించే ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. ఈ శాంసంగ్ 5G ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రావడం గమనించదగ్గ విషయం. Dual 4G VoltE, Dual Band Wi-Fi, Bluetooth 5.3, GPS, USB Type-C పోర్ట్, NFCతో సహా బహుళ కనెక్టివిటీ లకు మద్దతు కలిగి ఉంది. ఇంకా, ఫోన్ బడ్జెట్ ధరలో లాంచ్ చేయబడుతుందని కూడా అంచనాలున్నాయి.అలాగే, స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నట్లు చెప్పబడింది. మరియు ఈ కొత్త ఫోన్ అమెజాన్‌లో సేల్ కు రాబోతోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో విడుదల కానున్న ఈ ఫోన్ పై భారీ అంచనాలున్నాయి. ఈ ఫోన్ ధర రూ.14,000 లోపే ఉండబోతున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu