Ad Code

3 కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ !


వాట్సాప్ యూజర్ల గోప్యత, భద్రతకు సంబంధించి సరికొత్తగా  3 ఫీచర్లను తీసుకువచ్చింది. అకౌంట్ ప్రొటెక్ట్, డివైజ్ వేరిఫికేషన్, ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ అనే మూడు ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ మూడు ఫీచర్స్ యూజర్ల భద్రతను, ప్రైవసీని కాపాడుతాయని మెటా పేర్కొంది. అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ యాక్సెప్ట్ చేస్తే కొత్త డివైజ్‌కు వాట్సాప్‌ను మార్చుకునేటప్పుడు పాత డివైజ్‌లో అనుమతి ఇవ్వడం తప్పనిసరి. ఇక మన ప్రమేయం లేకుండా మన ఫోన్‌లో మాల్‌వేర్‌ ద్వారా వాట్సాప్‌ నుంచి అనవసర మెసేజ్‌లు వెళ్తున్నాయా అన్నది గుర్తించడానికి 'డివైజ్‌ వెరిఫికేషన్‌' ఫీచర్‌ గుర్తిస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా హ్యాకర్స్ కనెక్షన్‌ను బ్లాక్‌ చేయడానికి వీలు ఉంటుంది. వాట్సాప్‌లో మనం పంపే మెసేజ్‌లు సేఫ్‌గా అవతలివారికి వెళ్తున్నాయా? లేక ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా? అనేది గుర్తించడానికి ఆటోమెటిక్‌ సెక్యూరిటీ కోడ్స్‌ ఫీచర్‌ పని చేస్తుంది. ఈ కొత్త ఫీచర్స్‌తో వాట్సాప్ యూజర్ల భద్రత మరింత పటిష్టం అవుతుందని మేటా యాజమాన్యం పేర్కొంది. వాట్సాప్ అప్‌డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్స్‌ను పొందుతారని పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu