Ad Code

రూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ !


ఉజాస్ ఈవీ కంపెనీ పలు రకాల మోడళ్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఉజాస్ ఇగో ఎల్ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 34,880 నుంచి ప్రారంభం అవుతోంది. కంఫర్టబుల్ స్మూత్ రైడింగ్ కోరుకునే వారు ఈ స్కూటర్‌ను పరిశీలించొచ్చు. రివర్స్ డ్రైవ్, కిలెస్ రైడింగ్ వంటి ఫీచర్లు కూడా దీని సొంతం. ఈ స్కూటర్ పలు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రెడ్, బ్లూ, డార్క్ గ్రే, లైట్ గ్రే వంటి కలర్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. మీరు మీకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఫుల్‌గా చార్జ్ కావడానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది. చార్జర్ వోల్టేజ్ 48వీ /60వీ. పవర్ 250 వాట్. స్టోరేజ్ కెపాసిటీ 8 లీటర్. ఇకపోతే ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. కంపెనీ ఇందులో డ్రమ్ బ్రేక్స్ అమర్చింది. టెలీ స్కోపిక్/ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంటే ఆకర్షణీయమైన రేంజ్ లభిస్తోందని చెప్పుకోవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu