Ad Code

6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా


చైనా పరిశోధకుల బృందం మొట్ట మొదటి రియల్ టైమ్ వైర్లెస్ ట్రాన్స్ మిషన్ తో అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్ను సాధించించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ సెకండ్ ఇన్స్టిట్యూట్ నుంచి పరిశోధన బృందం టెరాహెర్ట్జ్ ఆర్బిటల్ యాంగ్యులర్ మొమెంటం కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇందుకోసం 110 GHz ఫ్రీక్వెన్సీలో నాలుగు వేర్వేరు బీమ్ నమూనాలను రూపొందించడానికి ప్రత్యేక యాంటెన్నాను ఉపయోగించినట్లు తెలిపింది. ఆ నమూనాలతో, 10 GHz బ్యాండ్విడ్త్పై సెకనుకు 100 గిగాబిట్ల వేగంతో రియల్టైమ్ వైర్లెస్ ప్రసారాన్ని సాధించారు. అంతేకాదు, బ్యాండ్విడ్త్ వినియోగ సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు వెల్లడించింది. "భవిష్యత్తులో, ఈ సాంకేతికతను స్వల్ప-శ్రేణి బ్రాడ్బ్యాండ్ ట్రాన్స్మిషన్ ఫీల్డ్లకు కూడా వర్తింపజేయవచ్చు, మూన్, మార్స్ ల్యాండర్ల మధ్య హై-స్పీడ్ కమ్యూనికేషన్కు సైతం సపోర్టు చేస్తుంది. స్పేస్క్రాఫ్ట్, అంతరిక్ష నౌకకు ఎంతగానో ఉపయోగపడుతుంది” అని తాజా నివేదిక పేర్కొంది. హై ఫ్రీక్వెన్సీ కారణంగా, టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్ మరింత సమాచారాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. డేటా ట్రాన్స్ ఫర్ భారీ మొత్తంలో ఉంటుంది. 6G కమ్యూనికేషన్, హై-స్పీడ్ ఇంటర్నెట్, సంక్లిష్టమైన వాతావరణాలలో సైనికుల కమ్యూనికేషన్లలో ఉపయోగపడనుంది. వాస్తవానికి 6G మొబైల్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ 5Gతో పోల్చితే 10 నుంచి 20 రెట్లు వేగంగా ఉంటుంది. భవిష్యత్తులో, 6Gని ఉపయోగించి పీక్ కమ్యూనికేషన్ వేగం సెకనుకు ఒక టెరాబిట్కు చేరుకుంటుంది. 6G నెట్ వర్క్ విషయంలో చైనాతో పోల్చితే అమెరికా వెనుకబడినట్లే చెప్పుకోవచ్చు. అక్కడ ఇప్పుడిప్పుడే 6G నెట్క్ వర్క్ రూపకల్పనపై ప్రయోగాలు మొదలయ్యాయి. 6G నెట్వర్క్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ మధ్యే అమెరికా అధికారులు, నిఫుణులు వైట్ హౌస్ లో చర్చించారు. “5G అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, దాని పనితీరు, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీని ఆప్టిమైజ్ చేసి 6G నెట్వర్క్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాం” అని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. “6G సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సాధారణ ప్రజలకు ఉపయోగంలోకి రావడానికి చాలా టైమ్​ పడుతుంది. ఇది ప్రస్తుత 5G నెట్వర్క్ కంటే చాలా వేగంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించవచ్చు” అని వివరించారు. నిజానికి 2020 చివరలోనే అంతరిక్షంలో 6G ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పని తీరును ధ్రువీకరించాలనే ఆశతో, 6G సాంకేతికత కోసం ఉపయోగపడే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. కాగా, Huawei 6G టెక్నాలజీకి సంబంధించి సొంత రోల్ అవుట్ కోసం సిద్ధమవుతోంది. అటు 2030 నాటికి 6G అల్ట్రా-ఫాస్ట్ నెట్వర్క్ ని ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చైనీస్ అధికారులు వెల్లడించారు. భారత్ 2023 నాటికి 6G కమ్యూనికేషన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఓ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేశారు. దేశంలో 6G మిషన్లో భాగంగా, పరిశోధన కోసం ప్రాధాన్యత గల ప్రాంతాలను గుర్తిస్తుంది. త్వరలోనే 6G పరిశోధన మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu