Ad Code

అమెజాన్‌లో ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ !


ఐకూ ఇండియా కొద్ది రోజుల క్రితం ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అమెజాన్‌లో హయ్యెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్7 5జీ మోడల్ అని ఐకూ వెల్లడించింది. 2023లో రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య లాంఛ్ అయిన మొబైల్స్‌లో ఈ రికార్డ్ సృష్టించినట్టు వెల్లడించింది.   ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,400 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,599 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,599 ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ.855 ఈఎంఐతో ఐకూ జెడ్7 5జీ కొనొచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ.18,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.18,000 వరకు తగ్గింపు పొందొచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే మీరు చెల్లించాల్సింది రూ.999 మాత్రమే.  90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 9 ప్రో+, రెడ్‍మీ నోట్ 11 ప్రో+, రియల్‌మీ నార్జో 50 ప్రో, వివో వీ23 లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, పోర్ట్రెయిట్, నైట్, వీడియో, 64MP, పనో, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్-లాప్స్, ప్రో, వ్లాగ్ మూవీ, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ, 4కే వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, రానైట్, లైవ్ ఫోటో, వ్లాగ్ మూవీ, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 + ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu