Ad Code

కొత్త లుక్‌లో వాట్సాప్ ?


వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మార్చేసి మరింత యూజర్ ఫ్రెండ్లీగా, మోడర్న్‌గా ఉండే సరికొత్త యూఐ పరిచయం చేయాలని ఆండ్రాయిడ్ వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇప్పుడు వారి కోరిక మేరకు రీ-డిజైన్డ్‌ ఇంటర్‌ఫేస్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం వాట్సాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం 'బాటమ్ నావిగేషన్ బార్' ఫీచర్‌పై పని చేస్తున్నారు. ఈ అప్‌డేట్‌తో వాట్సాప్ యూఐ లుక్ మారిపోనుంది. చాట్స్‌, కాల్స్, స్టేటస్, కమ్యూనిటీస్ ట్యాబ్స్‌ ఈజీగా యాక్సెస్ చేయడం కుదురుతుంది. నావిగేషన్ బార్ కింద ఉంటే బొటనవేలుతో కావలసిన ట్యాబ్‌/సెక్షన్‌పై ఇబ్బంది లేకుండా క్లిక్ చేయవచ్చు. ఈ ట్యాబ్స్‌ పైన కాకుండా కింద కనిపిస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉండొచ్చు. సాధారణంగా ఐఫోన్లలో వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ వేరేలా ఉంటుంది. ఇందులో యాప్ సెక్షన్లు అన్నీ బాటమ్‌లో ఉంటాయి. వీటిని యాక్సెస్ చేయడం ఈజీగా ఉంటుంది. అచ్చం అదే నావిగేషన్ బార్‌ను ఆండ్రాయిడ్‌లో కూడా వాట్సాప్ త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారిన వారు లేదా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కి మారిన వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రెండింటిలో ఇంటర్‌ఫేస్ ఒకేలా ఉంటుంది. ప్రస్తుతానికి అప్‌కమింగ్ ఫీచర్ 'బాటమ్ నావిగేషన్ బార్' బీటా టెస్టర్‌లకు కూడా అందుబాటులోకి రాలేదు. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.8.4 అప్‌డేట్‌లో కొత్త నావిగేషన్ బార్ కనిపించినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం మీద వినియోగదారులు నావిగేట్ చేయడానికి మెరుగైన, సులభమైన మార్గాన్ని కోరుకున్నారు, కాబట్టి డెవలపర్లు ఆ అవసరాన్ని తీర్చడానికి బాటమ్ నావిగేషన్ బార్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ కొత్త అప్‌డేట్‌కి సంబంధించి ఒక స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేసింది. అందులో ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్‌లో కింద భాగంలో ముఖ్యమైన సెక్షన్లు కనిపించాయి. ఆ బాటమ్ నావిగేషన్ బార్‌లో మొదటగా చాట్స్, తర్వాత కమ్యూనిటీస్, ఆపై స్టేటస్, లాస్ట్‌లో కాల్స్‌ సెక్షన్ కనిపించింది. ఇవన్నీ ఐకాన్లతో చక్కగా కనిపించాయి.

Post a Comment

0 Comments

Close Menu