Ad Code

బిఎస్ఎన్ఎల్ కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ !


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కస్టమర్లకు గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ప్రధానాంశంగా కొత్త ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ ను రూ. 269 రూపాయల ధరతో అందించింది మరియు దీన్ని Gaming STV 269 పేరుతో ప్రకటించింది. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో డైలీ 2GB డైలీ హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత డేటా స్పీడ్ 40Kbps కి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 ఉచిత SMS లను కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో లభించే ఇతర ప్రయోజనాల గురించి చూస్తే, ఈ ప్లాన్ తో EROSnow కోసం ఉచిత యాక్సెస్ అందుతుంది. దీనితో పాటుగా హార్డీ మొబైల్ గేమ్స్, ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్,గేమ్ ఆన్ సర్వీస్ మరియు GAMEIUM ప్రీమియం గేమింగ్ అప్లికేషన్ కోసం యాక్సెస్ ను అందకుంటారు. అంతేకాదు, Lystn మ్యూజిక్ సర్వీస్, Lokdhun మరియు Zing సర్వీస్ లను కూడా ఈ ప్లాన్ యూజర్లకు అఫర్ చేస్తోంది. అలాగే, ఈ ప్లాన్ BSNL Tunes కి కూడా యాక్సెస్ లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu