అమెజాన్ గేమింగ్ విభాగాల్లో వంద మందికి పైగా ఉద్యోగుల తొలగింపు


అమెజాన్ గేమింగ్ విభాగాల్లో పనిచేసే 100 మందికి పైగా ఉద్యోగులను తాజాగా తొలగించింది. ఏడబ్ల్యూఎస్‌, అమెజాన్‌ అడ్వటైజింగ్‌, ట్విచ్‌, హెచ్ఆర్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగించే పనిలో అమెజాన్ ఉంది. లేఆఫ్స్‌పై అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపారు. ఆ మెయిల్స్‌లో తొలగింపుల నిర్ణయం కష్టంతో కూడుకున్నది. కానీ సంస్థ దీర్ఘకాలిక విజయాలు సాధించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని చావు కబురు చల్లగా చెప్పాడు. గతేడాది నవంబర్‌లో అమెజాన్‌ సీఈవో ఆండీ జెస్సీ తొలిసారి ఉద్యోగుల తొలగింపులపై కీలక ప్రకటన చేశారు. అమెజాన్‌ People eXperience and Technology (PXT)కి చెందిన ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది జనవరిలో 18వేల మందిని అమెజాన్‌ ఫైర్‌ చేసింది. తాజాగా మరో 9 వేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

Post a Comment

0 Comments