Ad Code

యూట్యూబ్ లో రియల్-టైమ్ లిరిక్స్ ఫీచర్ !


2015లో గూగుల్‌ తీసుకొచ్చిన మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ యాప్ పాటలు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు, మ్యూజిక్ వీడియోలతో చాలా పెద్ద లైబ్రరీని యూజర్లకు అందిస్తోంది. అంతేకాదు, వినియోగదారు ఇష్టాలు, లొకేషన్, ప్లే హిస్టరీ ఆధారంగా సరైన మ్యూజిక్ రికమెండ్ చేస్తుంది. ఇందులో ఆఫ్‌లైన్ ప్లేబ్యాక్, యాడ్-ఫ్రీ లిజనింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ యాప్‌లో కొన్ని కీలకమైన ఫీచర్లు అందుబాటులో లేవు. ఫలితంగా ఇది వేరే మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌తో పోల్చుకుంటే వెనుకబడింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ మ్యూజిక్‌కి సరికొత్త ఫీచర్లను గూగుల్ యాడ్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రియల్-టైమ్‌ లిరిక్స్ అనే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ , iOS యూజర్లకు రిలీజ్ చేస్తోంది. సాధారణంగా ఏదైనా ఒక సాంగ్ వింటున్నప్పుడు దాని లిరిక్స్ కూడా కనిపిస్తే బాగుంటుందని యూజర్లు అనుకుంటారు. ఇలాంటి వారి కోసం స్ట్రీమింగ్ యాప్స్ సాంగ్ ప్లే అవుతున్న "నౌ ప్లేయింగ్" పేజీలోనే లిరిక్స్ అందిస్తున్నాయి. కొంత కాలం క్రితమే లైవ్ లిరిక్స్ కూడా తీసుకొచ్చాయి. అంటే ఆడియో సాంగ్‌కి లింక్ అవుతూ సాంగ్ పేజీలోనే లిరిక్స్ లైన్-బై-లైన్ కనిపిస్తాయి. స్పాటిఫై వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ ఆల్రెడీ ఈ ఫీచర్‌ను పరిచయం చేశాయి. యూట్యూబ్ మ్యూజిక్ కూడా తాజాగా దీనిని అందుబాటులోకి తెస్తోంది. రియల్-టైమ్ లిరిక్స్ యూజర్లు వినే ప్రతి లైన్‌ను హైలైట్ చేస్తుంది. పాట వినేటప్పుడు దాని లిరిక్స్ స్క్రీన్‌పై స్పష్టంగా, పెద్దగా కనిపిస్తుంటే వాటిని యూజర్లు చూస్తూ పాడుకోవచ్చు. ఈ ఫీచర్ రాకముందు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లిరిక్స్ లేఅవుట్‌ను మ్యానువల్‌గా పైకి స్వైప్ చేయడం ద్వారా లిరిక్స్ చదువుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతానికి ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ అవుతున్నట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా ఇది విడుదల అవుతోంది. కొత్త ఫీచర్ అనేది వింటున్న పాట లైన్‌ను తెలుపు రంగులో హైలైట్ చేస్తుంది. ఆ లైన్ పరిమాణం లిరిక్స్‌లోని ఇతర భాగాల కంటే పెద్దగా కనిపిస్తుంది. మిగతా లైన్స్ కాస్త చిన్నగా, డార్క్ కలర్‌లో కనిపిస్తాయి. దీని వల్ల వినియోగదారులు తమకు ఇష్టమైన ట్యూన్లకు అనుగుణంగా పాటలు పాడటం సులభం అవుతుంది. iOSలో, YouTube Music యూజర్లు లిరిక్స్ ట్యాబ్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్‌ను కూడా గమనించారు. దీనివల్ల లిరిక్స్ అనేది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రీసెంట్‌గా యూట్యూబ్ మ్యూజిక్‌ యూజర్లు ఇష్టమైన సంగీతాన్ని వింటూనే పాటలు, ఆల్బమ్ క్రెడిట్లను చూసుకునే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అలానే ఆండ్రాయిడ్‌లో ఇప్పుడు కొత్త ఆటో-డౌన్‌లోడ్ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఇది ఇటీవల ప్లే చేసిన 200 పాటలను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. ఈ ఫీచర్ తొలత జనవరి నెలలో విడుదల అయ్యింది. యూట్యూబ్ మ్యూజిక్ 2023 ఫిబ్రవరి కొత్త ఫీచర్‌ల హైలైట్‌లలో కూడా కనిపించింది.

Post a Comment

0 Comments

Close Menu