Ad Code

వాట్సాప్ 'కీప్ మెసేజెస్' ఫీచర్ !


వాట్సాప్ కొంతకాలం క్రితం డిసప్పియరింగ్ మెసేజెస్‌ పేరిట ప్రైవసీ ఫీచర్‌ను పరిచయం చేసింది. సున్నితమైన, పర్సనల్ మెసేజ్‌లు పంపించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. అయితే దీనిలో కొన్ని మైనస్‌లు ఉన్నాయి. వాటికి సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ పరిష్కారాలను చూపుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కీప్ మెసేజెస్  పేరుతో ఒక ఫీచర్ రిలీజ్ చేస్తోంది. ఆండ్రాయిడ్, iOS రెండింటి బీటా వెర్షన్లకు కొత్త ప్రైవసీ ఫీచర్‌ను జత చేస్తోంది. ఈ ఫీచర్‌తో డిసప్పియరింగ్ మెసేజెస్‌ చాట్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లు అదృశ్యం కాకుండా సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఫీచర్ల ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో  ప్రకారం, కంపెనీ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. డిసప్పియరింగ్ మెసేజెస్‌ చాట్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లను డిలీట్ కాకుండా అలాగే ఉంచుకోవడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ 2.23.8.3కి 'కీప్ మెసేజెస్' ఫీచర్ రిలీజ్ అవుతున్నట్లు WABetaInfo వెల్లడించింది. ఈ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకున్నాక చాట్ హెడర్‌లో ఉన్న బుక్‌మార్క్ ఐకాన్‌తో కావాల్సిన మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు. డిసప్పియరింగ్ మెసేజెస్‌ చాట్‌లో సేవ్ చేయదలచుకున్న మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ ఇచ్చినప్పుడు ఈ బుక్‌మార్క్ ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మెసేజ్‌ను పర్మినెంట్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్‌లను తర్వాత తిరిగి చూసుకోవచ్చు. ఒకవేళ మెసేజ్‌ శాశ్వతంగా డిలీట్ అయిపోవాలంటే, వారు "అన్‌కీప్" ఐకాన్‌పై క్లిక్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మెసేజ్ శాశ్వతంగా డిలీట్ అవుతుంది. దాన్ని మళ్లీ అదృశ్యం కాకుండా ఎవరూ ఆపలేరు. ఇక యూజర్లు తమ చాట్ మెసేజ్‌లపై ఇప్పటికీ పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారు. ఉదాహరణకు చాట్‌లోని అవతలి వ్యక్తి మీరు పంపిన ఫలానా మెసేజ్‌ అదృశ్యం కాకుండా ఉంచినా, అది మళ్లీ ఎవరికీ కనిపించకుండా పోవాలని మీరు కోరుకుంటే, "అన్‌కీప్"పై సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు దీన్ని ఒకసారి అన్‌కీప్ చేస్తే, ఆ మెసేజ్‌పై అవతలి వ్యక్తి (Recipient) "కీప్ మెసేజెస్" ఫీచర్‌ను వాడలేరు. అంటే ఇద్దరికీ సమ్మతి ఉంటేనే వీటిలో ఒక మెసేజ్ సేవ్ చేసుకోవడం కుదురుతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లతో పాటు వాట్సాప్ iOS 23.7.0.72 అప్‌డేట్ బీటా వాడే కొంతమంది టెస్టర్లకు ఈ ఫీచర్‌ రిలీజ్ అవుతున్నట్లు WABetaInfo వెల్లడించింది. iOS యూజర్లు TestFlight యాప్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్‌ను పొందవచ్చు. మరికొద్ది వారాల్లో రెగ్యులర్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu