Ad Code

ఇండియాలో విస్తరించడానికి సంకల్పించాం !


ఇండియాలో యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడంతో పాటు సేల్స్ పెంచుకునేందుకు రిటైల్ స్టోర్స్‌ కూడా ప్రారంభిస్తోంది. ఇప్పటికే ఐఫోన్ల తయారీ యూనిట్లను ప్రారంభించే పనుల్లో కంపెనీ వేగం పెంచింది. మరోవైపు యాపిల్ రిటైల్ స్టోర్స్‌ కూడా ఈ వారంలోనే ఇండియాలో ఓపెన్ కానున్నాయి. ముంబైలో Apple BKC స్టోర్ ఏప్రిల్ 18, మంగళవారం ఉదయం 11 గంటలకు ఓపెన్ కానుంది. ఢిల్లీలోని Apple Saket స్టోర్, ఏప్రిల్ 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో తమ కంపెనీ దీర్ఘకాలం సేవలందించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. భారతదేశంలో యాపిల్ సేవలను, లాంగ్ టర్మ్ హిస్టరీని విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు కంపెనీ CEO టిమ్ కుక్ తెలిపారు. ఈ వారం ఇండియాలో రెండు యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయడంతో పాటు దేశంలో కంపెనీ సేవలను ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వారం నుంచి కస్టమర్లు యాపిల్ లేటెస్ట్ ప్రొడక్ట్ లైనప్‌ను రిటైల్ స్టోర్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు. అలాగే స్టోర్‌లోని ఎక్స్‌పర్ట్స్, క్రియేటివ్స్, స్పెషలిస్ట్స్ సేవలు, సపోర్ట్ పొందవచ్చని యాపిల్ పేర్కొంది. 'భారతదేశం చాలా అందమైన సంస్కృతి, అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. ఇక్కడ మా లాంగ్ టర్మ్ హిస్టరీని నిర్మించడానికి, విస్తరించడానికి సంకల్పించాం. మా కస్టమర్లకు మద్దతు ఇవ్వడం, లోకల్ కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పని చేయడం అనే లక్ష్యాలతో పనిచేస్తాం' అని యాపిల్ CEO టిమ్ కుక్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu