Ad Code

వాట్సాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చదవవచ్చు !


ఏ యాప్ సాయం లేకుండా, వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుండా, ఏ మెసేజ్ వచ్చినా చదివేయొచ్చు. నోటిఫికేషన్ ప్యానెల్‌లో వాట్సప్ మెసేజ్ చదవొచ్చని తెలుసు. కానీ నోటిఫికేషన్ ప్యానెల్‌లో మొత్తం మెసేజ్ కనిపించదు. మరి మొత్తం మెసేజ్ చదవాలంటే ఏం చేయాలి? వాట్సప్ యాప్ ఓపెన్ చేయాలి. కానీ ఓ చిన్న ట్రిక్‌తో మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మెసేజ్ మొత్తం చదివేయొచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే పైన చెప్పిన ట్రిక్ పనిచేస్తుంది. ఇందుకోసం మీరు వాట్సప్ విడ్జెట్ వాడాల్సి ఉంటుంది. హోమ్ స్క్రీన్ పైన ఎన్ని స్లైడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మెయిన్ హోమ్ స్క్రీన్ పక్కన ఇంకో స్లైడ్ క్రియేట్ చేయొచ్చు. ఇలా ఓ స్లైడ్ పైన మీరు వాట్సప్ విడ్జెట్ యాడ్ చేయాలి. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి. మీకు వచ్చే ఆప్షన్స్‌లో విడ్జెట్స్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. కిందకు స్క్రోల్ చేస్తే వాట్సప్ విడ్జెట్ కనిపిస్తుంది. వాట్సప్ విడ్జెట్ ట్యాప్ చేసి హోమ్ పేజీలో యాడ్ చేయాలి. వాట్సప్ విడ్జెట్‌ను క్లీన్ స్లైడ్ పైన ఫుల్ స్క్రీన్‌లో అడ్జెస్ట్ చేయొచ్చు. ఈ చిన్న మార్పుతో మీరు మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ చదివేయొచ్చు. మీకు వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ వస్తే యాప్ ఓపెన్ చేయకుండా విడ్జెట్‌లో చూస్తే చాలు. ఫుల్ మెసేజ్ కనిపిస్తుంది. మీరు చదవని మెసేజెస్ అన్నీ విడ్జెట్‌లో కనిపిస్తాయి. ఇక మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేసి ఆ మెసేజెస్ చదివిన తర్వాత విడ్జెట్‌లో మెసేజెస్ కనిపించవు. వాట్సప్ ఇటీవల 5 కొత్త ఫీచర్స్ విడుదల చేసింది. వాట్సప్ స్టేటస్‌ను ఎవరు చూడాలో మీరే నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇకపై వాట్సప్ స్టేటస్‌లో 30 సెకండ్ల ఆడియో కూడా షేర్ చేయొచ్చు. స్టేటస్‌కి వేగంగా రిప్లై ఇచ్చేందుకు స్టేటస్ రియాక్షన్స్ ఫీచర్ అందిస్తోంది వాట్సప్. స్టేటస్ ప్రొఫైల్ రింగ్‌లో మీ కాంటాక్ట్‌లో ఉన్న వారి ప్రొఫైల్ పిక్చర్స్ కనిపిస్తాయి. స్టేటస్‌లో ఎవరైనా లింక్ పోస్ట్ చేస్తే విజువల్ ప్రివ్యూ కనిపిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu