Ad Code

ఉద్యోగులపై కిండ్రిల్ వేటు !


ఐబీఎం నుంచి వేరుపడిన కిండ్రిల్ భారత్‌లో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. లేఆఫ్స్ గురించి ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం అందించామని, ఉద్యోగుల బకాయిలు కూడా క్లియర్ చేశామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను వర్తింపచేస్తామని చెప్పారు. మరోవైపు కిండ్రిల్ భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇటీవల వెల్లడించింది. కిండ్రిల్‌లో పనిచేస్తున్న మొత్తం 90,000 మంది ఉద్యోగుల్లో 50 శాతం మంది భారత్‌లోనే పనిచేస్తున్నారని పేర్కొంది. మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, హెచ్ఆర్, కీలకేతర విభాగాల ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం అధికంగా ఉందని సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu