Ad Code

పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతం


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగాన్నివిజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్‌)లో ఆదివారం నిర్వహించిన పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ సక్సెస్ అయింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెక్కలున్న లాంచ్‌ వెహికల్‌ను హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్ చేసినట్లు ఇస్రో వెల్లడించింది. మొత్తం ప్రయోగం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ అయినట్లు పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu