Ad Code

ఎలాన్‌ కు వైట్ హౌస్ ఝలక్ ?


ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు డబ్బులు చెల్లించకూడదంటూ వైట్‌హౌస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ సిబ్బంది అధికారిక ట్విటర్ ప్రొఫైల్స్‌ని వెరిఫైడ్ అకౌంట్స్‌గా కొనసాగించేందుకు వైట్‌హౌస్ రుసుం చెల్లించేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ తమ సిబ్బందికి ఓ ఈమెయిల్ పంపినట్లు సమాచారం. వైట్ హౌస్ సిబ్బందికి డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ రాబ్ ఫ్లాహర్టీ ఈమెయిల్ పంపించారు. ఈమెయిల్‌లో స్టాఫర్స్‌కి గైడెన్స్‌ని వివరించినట్లు సమాచారం. కేవలం పెయిడ్ యూజర్‌గా గుర్తించేందుకు మాత్రమే ఈ వెరిఫికేషన్ సర్వీస్‌ని ట్విటర్ అందిస్తోందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈమెయిల్‌లో స్టాఫర్స్‌ని రాబ్ కోరారు. వ్యక్తి అథారిటీని గుర్తించేందుకు వెరిఫికేషన్‌ని ఒక సర్వీసుగా సమకూర్చట్లేదని సిబ్బందికి డైరెక్టర్ సూచించారు. ట్విటర్ సవరించిన కొత్త పాలసీ నిబంధనలను వైట్‌హౌస్‌కు అనుగుణంగా లేవని మెయిల్‌లో స్పష్టం చేసినట్లు సమాచారం. ఫలితంగా సిబ్బంది అకౌంట్‌లకు వెరిఫికేషన్ కొనసాగింపుపై వైట్‌హౌస్ గ్యారంటీ ఇవ్వబోదని ఫ్లాహర్టీ తెలిపారు. వైట్‌హౌస్ డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ పంపించిన మార్గదర్శకాలు అన్ని ప్రభుత్వ విభాగాలకు అమలు అవుతాయనే నిబంధనేమీ లేదు. అయితే, కొన్ని ఏజెన్సీలకు, ప్రభుత్వ విభాగాలకు షరతులతో కూడిన మార్గదర్శకాలను డైరెక్టర్ పంపించే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వంటి కొంతమంది అధికారులకు మాత్రం 'గ్రే చెక్‌మార్క్' కొనసాగుతుందని తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Post a Comment

0 Comments

Close Menu