Ad Code

బార్డ్‌కు త్వరలో మేజర్ అప్‌గ్రేడ్స్ !


ఓపెన్ ఏఐ క్రియేట్ చేసిన వైరల్ చాట్‌బాట్ చాట్‌జీపీటికి దీటైన పోటీ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇటీవల బార్డ్‌ను లాంఛ్ చేసింది. పబ్లిక్ టెస్టింగ్‌కు తొలుత బార్డ్‌ను లాంఛ్ చేయగా తాజాగా ఈ ఏఐ టూల్‌పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బార్డ్‌లో సమయానుకూలంగా అప్‌గ్రేడ్స్ ఉంటాయని, త్వరలోనే బార్డ్‌లో పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బార్డ్‌లో మేజర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని, ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుందని ఓ వార్తాసంస్ధకు ఆయన వెల్లడించారు. బార్డ్ త్వరలోనే అద్భుతంగా రెస్పాన్స్ వస్తుందని వచ్చే వారంలోనే మేజర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని చెప్పారు. రీజనింగ్‌, కోడింగ్ సహా అన్ని విభాగాల్లో బార్డ్ మెరుగ్గా పనిచేసేలా పురోగతి సాధిస్తుందని అన్నారు. మ్యాథ్స్ ప్రశ్నలకు కూడా ఇది మెరుగ్గా బదులివ్వనుందని, వచ్చే వారంలోనే మీరు ఈ పురోగతిని గమనించవచ్చని పిచాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బార్డ్ లైట్‌వెయిట్‌, సమర్ధవంతమైన లామ్డా వెర్షన్‌పై రన్ అవుతోందని తెలిపారు. చాట్‌జీపీటీ రాకతో గూగుల్‌లో కోడ్ రెడ్ పరిస్ధితి తలెత్తిందన్న ప్రశ్నకు బదులిస్తూ తాను ఎన్నడూ కోడ్ రెడ్ జారీ చేయలేదని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu