Ad Code

హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లు !


కొరియన్ కార్ల దిగ్గజం హ్యుందాయ్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి వాటా ఉంది. ముఖ్యంగా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లోని ఈ కంపెనీ కార్లకు డిమాండ్ బాగుంది. ఇప్పటికే అమ్మకాల్లో మంచి వృద్ధిని కనబర్చిన వెర్నా అప్‌గ్రేడ్ మోడల్‌ను కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ సెడాన్ సెగ్మెంట్‌లో, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌పై మంచి ఆఫర్స్ ప్రకటించింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది నిజంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. హ్యుందాయ్ కంపెనీ ఏయే మోడళ్లపై ఎంత డిస్కౌంట్లు ఇస్తుందో తెలుసుకుందాం. హ్యుందాయ్ లైనప్‌లో ప్రస్తుతం నియోస్, ఆరా, i20, వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కాజర్, కోనా EV, ఐయోనిక్ 5 వంటి మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌పై కంపెనీ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో దాదాపు రూ.50,000 వరకు ఆఫర్లు, బెనిఫిట్స్ ప్రకటించింది. హ్యుందాయ్ i20కి చెందిన Magna, Sportz వేరియంట్‌లపై కంపెనీ బెస్ట్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ రెండు వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది. ఇక i20 N లైన్‌పై కంపెనీ రూ.15,000 అదనపు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. హ్యుందాయ్‌కు చెందిన ఈ రెండు మోడల్స్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ మోడల్స్‌పై కంపెనీ రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3000 అడిషనల్ కార్పొరేట్ డిస్కౌంట్‌తో మొత్తం రూ.23,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక సీఎన్‌జీ పవర్‌ట్రెన్ మోడల్స్‌పై కూడా కంపెనీ ఆఫర్స్ ప్రకటించింది. వీటిలో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. హ్యుందాయ్‌కు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఏకంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇక హ్యుందాయ్ లైనప్‌లో ఐయోనిక్ 5, వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కాజార్ వంటి మోడల్స్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో లేవు. ద్రవ్యోల్బణం కారణంగా ఇటీవల పలు కంపెనీలు తమ కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, MG మోటార్స్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్ కూడా కొన్ని రకాల మోడల్స్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హ్యుందాయ్ i20, i20 N లైన్, నియోస్, ఆరా, కోనా EV మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu